- Telugu News Photo Gallery Sports photos Ipl 2021 5 players from sunrisers hyderabad might not get chance in tournament
ఐపీఎల్ 2021: ఈ ఐదుగురు సన్‌రైజర్స్ ప్లేయర్స్ బెంచ్‌కే పరిమితం.! తుది జట్టులో నో ఛాన్స్.!!
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చాలామంది అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నారు. ఈ క్రమంలో కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్ 2021 టోర్నమెంట్ అంతటా బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంది.
Updated on: Mar 03, 2021 | 5:19 PM

ఐపీఎల్ 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అబ్దుల్ సమద్ 12 మ్యాచ్‌లు ఆడాడు. అయినప్పటికీ, అతని చక్కటి ప్రదర్శన కనబరచలేదు. అందుకే ఐపీఎల్ 2021లో, టోర్నమెంట్ అంతటా అబ్దుల్ సమద్ బెంచ్‌కు పరిమితం అయ్యే అవకాశం ఉంది.

ఐపీఎల్ 2018,2019,2020లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన తంపి 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఐపీఎల్ 2020లో, అతను కేవలం ఒక మ్యాచ్ ఆడి, అందులో 46 పరుగులకు ఒక వికెట్ తీశాడు. ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఇప్పటికే భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, టి నటరాజన్ వంటి అద్భుతమైన పేస్ బౌలర్లు ఉండటంతో.. తంపికి ఛాన్స్ దొరికే అవకాశం తక్కువే.

ఐపీఎల్ 2016లో, సుచిత్ ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. అందులో అతను వికెట్ తీయలేదు. ఐపీఎల్ 2019లో కూడా అతని పేరు మీద రెండు వికెట్లు ఉన్నాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఇప్పటికే రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఉండటంతో జగదీష్ సుచిత్‌కు చోటు దక్కడం కష్టమే.

ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ విరాట్ సింగ్‌ను ఐపీఎల్ 2020 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 1.9 కోట్లకు కొనుగోలు చేసింది. అయినప్పటికీ, అతనికి ఒక్క అవకాశం కూడా రాలేదు. 23 ఏళ్ల విరాట్ సింగ్ దేశవాళీగా జార్ఖండ్ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్ 2021లో, సన్ రైజర్స్ హైదరాబాద్‌లో కేన్ విలియమ్సన్ డేవిడ్ వార్నర్, మనీష్ పాండే, విజయ్ శంకర్, కేదార్ జాదవ్, జానీ బెయిర్‌స్టో వంటి అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌లు ఉండటంతో విరాట్ సింగ్‌కు అవకాశం దొరకడం కష్టమే.

ఐపీఎల్ 2020 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున శ్రీవాత్సవ్ గోస్వామి కేవలం రెండు మ్యాచ్‌లు ఆడాడు. వికెట్ కీపర్ స్థానంలో, ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో వృద్దిమాన్ సాహా, జానీ బెయిర్‌స్టో ఉండగా.. గోస్వామికి వాళ్ళిద్దరిలో ఒకరికి గాయం అయ్యే తప్పుకుంటే తప్ప అవకాశం దొరకదు.




