Telugu News » Photo gallery » Sports photos » From messi to mbappe these 4 players in golden boot list top contenders and rules check here after fifa world cup 2022 final
Golden Boot FIFA World Cup 2022: నలుగురు ఆటగాళ్ల మధ్యే గోల్డెన్ బూట్ రేస్.. నేటి మ్యాచ్‌తో తేలనున్న మూడు అవార్డులు..
Venkata Chari |
Updated on: Dec 18, 2022 | 5:04 PM
Golden Boot FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచ కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి గోల్డెన్ బూట్ ఇవ్వనున్నారు. ఈసారి ఈ అవార్డు కోసం మెస్సీ సహా నలుగురు ఆటగాళ్ల మధ్య పోటీ నెలకొంది.
Dec 18, 2022 | 5:04 PM
ఫిఫా వరల్డ్ కప్ 2022 (FIFA World Cup 2022) ఫైనల్ మ్యాచ్ ఈరోజు జరగనుంది. లుసైల్ స్టేడియంలో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు (Argentina vs France) తలపడనున్నాయి. ప్రపంచకప్ ట్రోఫీతో పాటు అందరి చూపు కూడా మూడు పెద్ద అవార్డులపైనే ఉంటుంది. గోల్డెన్ బాల్, గోల్డెన్ బూట్, గోల్డెన్ గ్లోవ్స్ ఎవరికి లభిస్తాయనేది కూడా ఈ రోజు ఫైనల్ మ్యాచ్‌తోనే నిర్ణయించనున్నారు. గోల్డెన్ బాల్ కోసం, లియోనెల్ మెస్సీ ముందంజలో ఉన్నాడు. అదే సమయంలో, గోల్డెన్ గ్లోవ్స్ కోసం చాలా మంది గోల్ కీపర్ల మధ్య పోటీ నెలకొంది. మరోవైపు గోల్డెన్ బూట్ కోసం నలుగురు ఆటగాళ్ల మధ్య పోటీ నెలకొంది.
1 / 6
ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి గోల్డెన్ బూట్ ఇవ్వనున్నారు. టై అయినప్పుడు, ఏ ఆటగాడికి ఎక్కువ అసిస్ట్‌లు ఉన్నాయో చూడొచ్చు. అసిస్ట్‌ల సంఖ్య కూడా సమానంగా ఉంటే, తక్కువ సమయం మైదానంలో ఉండే ఆటగాడికి ఈ అవార్డు ఇవ్వనున్నారు.
2 / 6
1. లియోనెల్ మెస్సీ: లెజెండ్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఈ రేసులో ముందంజలో ఉన్నాడు. ఈ ప్రపంచకప్‌లో అతను 5 గోల్స్ చేశాడు. ఈ ప్రపంచకప్‌లో 6 మ్యాచ్‌ల్లో 570 నిమిషాలు మైదానంలో గడిపాడు. ఈ ప్రపంచకప్‌లో మెస్సీ 3 అసిస్ట్‌లు చేశాడు.
3 / 6
2. కిలియన్ ఎంబాప్పే: ఫ్రాన్స్‌కు చెందిన ఈ స్టార్ ఫార్వర్డ్ ప్లేయర్ గోల్డెన్ బూట్ రేసులో రెండవ స్థానంలో ఉన్నాడు. ఎంబాప్పే 6 మ్యాచ్‌లలో 477 నిమిషాలు మైదానంలో గడిపాడు. 5 గోల్స్ చేశాడు. ఎంబాప్పే కూడా రెండు అసిస్ట్‌లు చేశాడు.
4 / 6
3. జూలియన్ అల్వారెజ్: అర్జెంటీనాకు చెందిన ఈ యువ స్ట్రైకర్ కూడా ఇప్పటివరకు 4 గోల్స్ చేశాడు. అల్వరాజ్ 6 మ్యాచ్‌ల్లో కేవలం 364 నిమిషాలు మాత్రమే మైదానంలో గడిపాడు. మెస్సీ మరియు ఎంబాప్పే ఫైనల్ మ్యాచ్‌లో స్కోర్ చేయలేకపోతే, అల్వారెజ్ రెండు గోల్స్ చేయగలిగితే, అతను గోల్డెన్ బూట్ గెలుచుకోవచ్చు.
5 / 6
4. ఒలివర్ గిరాడ్: ఫ్రాన్స్‌కు చెందిన ఈ వెటరన్ స్ట్రైకర్ కూడా కేవలం 382 నిమిషాలు మైదానంలో గడిపి 4 గోల్స్ చేశాడు. నేటి మ్యాచ్‌లో అతను కూడా గోల్డెన్ బూట్ రేసులో ముందంజలో ఉండగలడు. ఇందుకోసం ఆయన కనీసం రెండు గోల్స్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఈరోజు మెస్సీ, ఎంబాప్పే స్కోర్ చేయడం కూడా తప్పనిసరి.