మిథున రాశి: ఈ రాశికి బుధుడు అధిపతి. ఈ గ్రహం తన మిత్ర క్షేత్రమైన వృషభ రాశిలో సంచరిస్తోంది. ఈనెల 24 తరువాత తన స్వక్షేత్రమైన మిధున రాశిలోకి ప్రవేశిస్తుంది. దాదాపు 45 రోజులపాటు బుధ గ్రహం మిధున రాశి వారికి అనుకూలంగా ఉండబోతోంది. దీనివల్ల ఆర్థికంగా పురోగతి చెందటం, ఉద్యోగంలో అభివృద్ధి కనిపించడం, నిరుద్యోగులకు ఉద్యోగం లభించడం, ఆరోగ్యం మెరుగుపడటం, కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోవటం, వృత్తి, వ్యాపారాలు పురోగతి సాధించడం వంటివి జరుగుతాయి. ఉద్యోగ పరంగా, ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.