Weekly Horoscope: వారికి ఆర్థికంగా అదృష్టం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు

Edited By:

Updated on: Jan 24, 2026 | 5:56 PM

వార ఫలాలు (జనవరి 25-31, 2026): మేష రాశి వారికి ఈ వారం వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వృషభ రాశి వారికి ఇంటా బయటా మంచి గుర్తింపు లభిస్తుంది. సర్వత్రా మీ మాటకు విలువ పెరుగుతుంది. మిథున రాశి వారికి కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమై ఊరట లభిస్తుంది. ఆస్తి వివాదాలు రాజీమార్గంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రాశ్యధిపతి కుజుడితో పాటు శుక్ర, గురువు, రవి, బుధుడు కూడా బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో దూసుకుపోతారు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదానికి సంబంధించి శుభవార్త వింటారు. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు ఊపందుకుంటాయి. కుటుంబ సభ్యులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. నిరుద్యోగులు, ఉద్యోగులకు ఊహించని కొత్త ఉద్యోగావకాశాలు అందుతాయి. కొత్త ఆలోచనలకు, కొత్త ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది.

2 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడితో పాటు రవి, శని, బుధు, కుజుల బలం కారణంగా ఇంటా బయటా మంచి గుర్తింపు లభిస్తుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. సర్వత్రా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. కొత్త బాధ్యతలను చేపట్టడం జరుగుతుంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ప్రయాణాలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు సాధారణంగా సాగి పోతాయి. బంధువుల్లో పెళ్లి ప్రయత్నాలు సాగించడం మంచిది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది.

3 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): గురు, శుక్ర, రవి గ్రహాల అనుకూలత వల్ల కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమై ఊరట లభిస్తుంది. ఆస్తి వివాదాలు రాజీమార్గంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. వ్యక్తిగత జీవితం బాగా బిజీగా సాగుతుంది. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలో జోరందుకుంటాయి. మిత్రుల కారణంగా కొద్దిగా డబ్బు నష్టపోవడం గానీ, మోసపోవడం గానీ జరుగుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. సొంత విషయాలపై శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు.

4 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): రవి, కుజుల బలం బాగా అనుకూలంగా ఉంది. ఆశించిన శుభ వార్తలు అందుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. రావలసిన సొమ్ము, బాకీలు పూర్తిగా చేతికి అందుతాయి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఇష్టమైన మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. వ్యాపార లావాదేవీలు చాలా వరకు లాభాల బాటలో సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన అనుకూలత ఉంటుంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

5 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): గురు, రాహువుల బలం అనుకూలంగా ఉండడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగపరంగా శుభవార్తలు అందుతాయి. ప్రతిష్ఠాత్మక కంపెనీలతో పాటు, విదేశీ ఆఫర్లు అందే అవకాశం కూడా ఉంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కొద్దిగా శ్రమ, తిప్పట ఉన్నప్పటికీ ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా చక్కబడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థికంగా మంచి అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు ఇవ్వకపోవడం మంచిది. వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.

6 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): రాశ్యధిపతి బుధుడు, శుక్రుడు, శనీశ్వరుల అనుకూలత వల్ల ఈ వారం చాలావరకు శుభప్రదంగా సాగిపోతుంది. ఆర్థిక బలం బాగా పెరుగుతుంది. అనేక విధాలుగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో బరువు బాద్యతలు పెరిగే సూచనలున్నాయి. అధికారులు మీ పని తీరును బాగా మెచ్చుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం పరవాలేనిపిస్తుంది.  ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. జీవిత భాగస్వామి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సహోద్యోగితో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

7 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రాశ్యధిపతి శుక్రుడితో పాటు బుధ, కుజ, శని గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా  ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగం పట్టే అవకాశం కూడా ఉంది. తోబుట్టువుల సహాయ సహకారాలతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఆశా జనకంగా సాగిపోతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది.  ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.

8 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): రాశ్యధిపతి కుజుడు ఉచ్ఛలో ఉన్నందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. లాభదాయక పరిచయాలు కలుగుతాయి. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల్ని తలదూర్చనివ్వవద్దు. ఆర్థికసాయం అందించడంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొందరు మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి.

9 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రాశ్యధిపతి గురువు సప్తమంలో, నాలుగు ప్రధాన గ్రహాలు ధన స్థానంలో ఉండడం వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. సమాజంలోని ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడుతుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువు లకు సంబంధించి సంతృప్తికరమైన సమాచారం అందుకుంటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.  ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. శుభవార్తలు వింటారు.

10 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ రాశిలో కుజుడు ఉచ్ఛపట్టడంతో పాటు శుక్ర, రవి, బుధ గ్రహాలు యుతి చెందడం, రాశ్యధిపతి శని అనుకూలంగా ఉండడం వల్ల వారమంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మరింతగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి మించి కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల మీద ఆధారపడడం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పరిచయస్థుల్లో పెళ్లి సంబంధం కుదరవచ్చు. పిల్లల చదువులు సాఫీగా సాగుతాయి.

11 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఒక్క గురువు తప్ప మరే గ్రహమూ అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ వారమంతా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆదాయానికి లోటుండదు కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో ఓర్పు, సహనాలతో  వ్యవహరించడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆదాయ మార్గాలు తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కొద్దిపాటి ఆటంకాలు, ఇబ్బందులున్నా ఆస్తిపాస్తులకు సంబంధించిన కొన్ని అత్యవసర పనులను పూర్తి చేస్తారు. ధనపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా మందకొడిగా సాగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అసంతృప్తి ఏర్పడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు కలిగే అవకాశం ఉంది.

12 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): లాభ స్థానంలో నాలుగు ప్రధాన గ్రహాల సంచారం వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఖర్చులు బాగా అదుపులో ఉంటాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాలపరంగానూ, ఆర్థికంగానూ స్థిరపడే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఎటు వంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు కాలుగుతాయి. ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.