తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆరవ స్థానంలో రాహువు, లాభ స్థానంలో రవి, శుక్రులు ఈ రాశివారికి కొండంత అండగా నిలబడడం జరుగుతుంది. ముఖ్యమైన ఆదాయ, ఆస్తి వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. తలపెట్టిన వ్యవహారాలు, పనులు, సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు, చేర్పులు జరుగుతాయి. ఉద్యోగపరంగా కొత్త లక్ష్యాలు, కార్యక్రమాలు మీ ముందుకు వస్తాయి. వ్యాపారాల్లో మీ సొంత ఆలోచనలు లాభాలను తీసుకు వస్తాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఆశించిన పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.