
మేషం: ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన శుక్రుడు ధన స్థానంలోనే సంచారం చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. దాంపత్య సమస్యలు మటుమాయం అవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది.

వృషభం: రాశ్యధిపతి శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగం కలిగింది. ఈ రాశికి చెందిన సగటు వ్యక్తులు సైతం సంపన్నులుగా మారే అవకాశం ఉంది. ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో రాజయోగాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. మంచి పరిచయాలు కలుగుతాయి. మనసులోని కోరికలు కొన్నినెరవేరుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.

మిథునం: ఈ రాశికి పంచమ, వ్యయ స్థానాధిపతిగా వ్యయ స్థానంలో శుక్ర సంచారం వల్ల జీవనశైలి మారి పోతుంది. విలాస జీవితం అలవడుతుంది. సుఖ సంతోషాల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. దాంపత్య జీవితం నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది. దూర ప్రాంతంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి తప్పకుండా అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. ఆస్తి లాభం కలుగుతుంది. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ప్రేమల్లో, పెళ్లి ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు.

సింహం: ఈ రాశికి దశమ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగం కలిగింది. దీనివల్ల పేరు ప్రతిష్ఠలు, పలుకుబడి బాగా పెరిగి ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందు తారు. ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవులు లభిస్తాయి. అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను దాటుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. జీవనశైలిలో మారిపోతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడి ప్రవేశం వల్ల అనేక విధాలైన అదృష్టాలు కలుగుతాయి. విదేశీ యానానికి మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. విదేశీ సంపాదనను అనుభవించే యోగం పడుతుంది. అనేక విధాలుగా సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి.

తుల: రాశ్యధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో, అందులోనూ స్వస్థానంలో ప్రవేశించడం వల్ల అదనపు ఆదాయ మార్గాలు నూరు శాతం సత్ఫలితాలనిస్తాయి. రావలసిన సొమ్ము, బాకీలు, బకాయిలు చేతికి అందుతాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఊహించని మార్గాల్లో ఆదాయం వృద్ది చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

వృశ్చికం: ఈ రాశివారికి సప్తమ కేంద్రంలో శుక్రుడి ప్రవేశం వల్ల మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. దీనివల్ల ఈ రాశివారి సిరి సంపదలు బాగా వృద్ధి చెందుతాయి. విదేశీయానానికి అవకాశాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదరడం, ప్రేమలో పడడం వంటివి జరుగుతాయి. దాంపత్య జీవితంలోని సమస్యలు చాలావరకు పరిష్కారమై, అన్యోన్యత పెరుగుతుంది. సామాన్య వ్యక్తి సైతం ఉచ్ఛస్థితికి ఎదగడం జరుగుతుంది.

ధనుస్సు: ఈ రాశికి ఆరవ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఆర్థిక, వ్యక్తిగత, అనారోగ్య సమస్యల నుంచి క్రమంగా బయటపడడం జరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమై, విలువైన ఆస్తి చేతికి అందుతుంది. భారీగా వస్త్రాభరణాలు కొనే అవకాశం ఉంది.

మకరం: ఈ రాశికి అయిదవ స్థానంలో శుక్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, జూదాలు, వడ్డీ వ్యాపారాల వంటి వాటి వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రాజపూజ్యాలు బాగా పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. సరికొత్త నైపుణ్యాలను అలవరచుకుంటారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి బాగా అవకాశం ఉంది.

కుంభం: ఈ రాశికి చతుర్థ కేంద్రంలో శుక్ర సంచారం వల్ల మాలవ్య మహా పురుష యోగంతో పాటు దిగ్బల యోగం కూడా ఏర్పడింది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. మాతృ సౌఖ్యం లభిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా ఒక విశిష్టమైన వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది. అధికార యోగం పడుతుంది. ప్రేమ వ్యవహారాలు, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.

మీనం: ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్రుడి ప్రవేశం కలలో కూడా ఊహించని ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. తక్కువ ప్రయత్నంతో ఎక్కువ లాభాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధాలుగా సంపద పెరిగే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. విదేశీయానానికి అవకాశం లభిస్తుంది. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది. ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది.