మే 31వ తేదీన(బుధవారం) వేకువజామున శుక్ర గ్రహం కర్కాటక రాశిలోకి మారుతోంది. కర్కాటక రాశిలో శుక్రుడు జులై ఆరవ తేదీ వరకు సంచరిస్తాడు. శుక్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం అన్నది కుటుంబపరంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రుడికి సంబంధించిన కర్కాటక రాశిలో శుక్రుడు ప్రవేశించినప్పుడు కుటుంబ పరంగా కొన్ని సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా శుభకార్యాలు జరగటం, కుటుంబంలో సామరస్యం పెరగటం, ఏవైనా సమస్యలు, మనస్పర్ధలు, అపార్ధాలు ఉన్న పక్షంలో అవి తొలగిపోవడం, పిల్లలు వృద్ధిలోకి రావడం, కుటుంబ పరంగా శుభవార్తలు వినటం వంటివి తప్పకుండా జరుగుతాయి. వ్యక్తిగత జాతకాలను బట్టి ఈ సానుకూల పరిణామాలలో కొద్దిగా హెచ్చుతగ్గులు ఉంటే ఉండవచ్చు. కానీ తప్పకుండా ఒకటి రెండు మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. శుక్ర గ్రహం రాశి మార్పు ఏ రాశుల వారికి ఏ విధంగా శుభవార్తలు మోసుకు వస్తుందో ఇక్కడ పరిశీలిద్దాం.