
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే వాస్తు శాస్త్ర నిపుణులు, తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. అయితే ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన వెంటనే తప్పకుండా శుభప్రదమైనవి మాత్రమే చూడాలి. లేకపోతే రోజు మొత్తం చాలా కష్టంగా సాగిపోతుంటది అని చెబుతుంటారు. కాగా, అసలు వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం లేచిన వెంటనే ఎలాంటివి చూడటం శ్రేయస్కరమూ ఇప్పుడు చూద్దాం.

ఉదయాన్నే నిద్రలేవడం తర్వాత మనం మొదట చేసే పని మనపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. చాలా మంది ఉదయం లేచిన వెంటనే అరచేతులు లేదా దేవుడి ఫొటో, మీకు అదృష్టాన్ని తీసుకొచ్చే వ్యక్తుల ముఖం చూడాలి అంటారు. అయితే వాస్తు ప్రకారం, ఉదయం లేచిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో కొన్నింటిని చూడకూడదంట. అవి ఏవి అంటే?

కొందరు కొంత మంది అరవడం, లేదా గొడవపడటం వంటివి వినడం లేదా చూడటం చేస్తుంటారు. కానీ అది అస్సలే మంచిది కాదంట. అలా ఎవరైనా బిగ్గరగా అరవడం విన్నట్లు అయితే ఆరోజు మీకు చెడ్డ రోజు, దాంతో ఆ రోజు మొత్తం మీరు చాలా సమస్యలు ఎదుర్కోక తప్పదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అందుకే ఉదయం లేచిన వెంటనే, కళ్లు మూసుకొని మీ ఇష్టదైవాన్ని ధ్యానించి, మంచి జరగాలని కోరుకోవాలంట.

అలాగే వాస్తు నిపుణుల ప్రకారం మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే నల్ల పిల్లి లేదా , నల్ల కుక్క, ఏడుస్తున్న వారిని అదే విధంగా ఇంటిలో చిరిగిపోయి ఉన్న దేవుడి ఫొటోలను చూడటం మంచిది కాదంట. దీని వలన మీరు రోజంతా మానసిక ఒత్తిడి, అడ్డంకులు వంటి సమస్యలు ఎదుర్కొంటారంట. అందుకే ఉదయం లేచిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో నల్లటి జంతువులను చూడకూడదంట.

Vasthu Tips3