
ఇక ఇంటికి వాస్తు చిట్కాలు, ఇంటి వాస్తుతో పాటు చాలా మంది కొన్ని అలవాట్ల కారణంగా చాలా మంది వాస్తు దోషానికి గురవుతున్నారు. కాగా, ఎలాంటి అలవాట్లు జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం ఏ వ్యక్తి అయితే పదే పదే తప్పుడు ప్రమాణాలు చేస్తుంటారో, వారి ఇంట్లో ఎప్పుడూ పేదరికమే ఉంటుందంట. తప్పడు ప్రమాణాలు చేయడం వలన ఆర్థిక నష్టం సంభవిస్తుందని చెబుతుంటారు పండితులు.

అదే విధంగా వాస్తు నిపుణుల ప్రకారం, ఏ వ్యక్తి అయితే ఇంటిలో పదే పదే ఉమ్మి వేస్తాడో ఆ ఇంటిలో పేదరికం తాండవం చేస్తుందంట. ఇంటిలోపల ఉమ్మి వేయడం వలన అది పేదరికాన్ని తీసుకొస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర పండితులు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఏ వ్యక్తి అయితే ఎక్కువగా మురికిగా ఉన్న మంచం మీద పడుకుంటాడో లేదా ఇల్లు ఎప్పుడూ చెత్తతో నిండి ఉంటుందో అలాంటి వారి ఇంట్లో వాస్తు సమస్యలు తలెత్తుతాయంట. అలాగే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయంట.

అదే విధంగా టాయిలెట్‌లో ఎక్కువగా మాట్లాడటం, ఎక్కువ సేపు టాయిలెట్స్ లో ఉండటం, మహిళలు నిలబడి తల దువ్వుకోవడం వంటివి కూడా ఇంట్లో ఆర్థిక సమస్యలను తీసుకొస్తాయంట. అదే విధంగా ఏ వ్యక్తి అయితే ఎప్పుడూ తల్లిదండ్రులను కించపరుస్తాడో అటువంటి ఇంట్లో పేదరికం ఎక్కువగా ఉంటుందంట.