Vastu Tips of Bedroom: అనుకూల దాంపత్యం కోసం బెడ్ రూమ్‌లో మంచం ఏ దిశలో ఉండాలంటే..

Updated on: Jul 31, 2023 | 6:59 AM

ప్రతి ఒక్కరూ  తమ బెడ్ రూమ్ అందంగా ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటారు. బెడ్ రూమ్ లో అడుగు పెట్టిన వెంటనే తాజాదనం కనిపించాలనుకుంటారు. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా సమయాన్ని గడపడానికి బెడ్ రూమ్ ఒక మంచి ప్లేస్ అని చెప్పవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం నివసించే ప్రదేశం శక్తి , మానసిక ఆరోగ్యం, సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఎవరైనా సరే పడకగదిని వాస్తు ప్రకారం సిద్ధం చేసుకోవాలి. ఈ రోజు బెడ్ రూమ్ ని ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం.. 

1 / 5
మంచం స్థానం: బెడ్ బెడ్ రూమ్ దక్షిణ లేదా నైరుతి మూలలో ఉండాలి. ఈ దిశ మంచం కోసం అనుకూలమైన దిశగా పరిగణించబడుతుంది. మంచం తల ద్వారం వైపుకి ఉండకూడదు. అంతేకాదు కిటికీ కింద ఉంచకూడదు. 

2 / 5
గోడ రంగులు: బెడ్ రూమ్ కోసం ప్రకాశవంతమైన రంగులను ఎంచుకోండి. ఎందుకంటే అవి చాలా ఉత్తేజకరమైనవి. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి గోడలపై కాంతివంతమైన కంటికి హాయిని కలిగించే రంగులను ఉపయోగించడం మంచిది. నైరుతి దిశలో బెడ్‌రూమ్‌లకు పింక్ లేదా పీచ్ రంగులు ప్రత్యేక లుక్ నిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలోని నీలం రంగు అందం, నిజాయితీ మరియు అంకితభావానికి చిహ్నంగా భావిస్తారు. అదే సమయంలో లేత ఆకుపచ్చ రంగు ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

3 / 5
కాంతి ఎంపిక: పగటిపూట సహజ కాంతి బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించేలా నిర్మించుకోండి. ఎందుకంటే సహజమైన కాంతి సానుకూల శక్తిని తెస్తుంది. అదే విధంగా సాయంత్రం బెడ్ రూమ్ లో ఆహ్లాదకమైన వాతావరణాన్ని సృష్టించడానికి మృదువైన లైటింగ్ ఉపయోగించండి. ప్రకాశవంతమైన కాంతిని నివారించండి. పడకగదిలో లేత నీలం లేదా పింక్ లైటింగ్ మీ పడకగది వాతావరణాన్ని మరింత శృంగారభరితంగా చేస్తుంది.

4 / 5
అద్దం ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలంటే: పడకగదిలో అసలు అద్దాలు పెట్టకూడదు. ఒకవేళ అద్దం బెడ్ రూమ్ లో ఉన్నట్లయితే.. నిద్రపోయే సమయంలో వాటిని కవర్ చేసుకోండి. అద్దం అల్లకల్లోలం సృష్టించగలదు. వాస్తు శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా మంచం ముందు అద్దం పెట్టకండి. అద్దం ఎంత పెద్దదైతే దాంపత్య బంధంలో అంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

5 / 5
బెడ్ రూమ్ అలంకరణ: ప్రేమ, సామరస్యం , ఐక్యత భావాలను తెలిపే విధంగా కళాకృతులను  అలంకరణలకు ఉపయోగించండి. పడకగదిలో ఉత్తర మూలలో ఇండోర్ మొక్కలు, నైరుతి మూలలో తెల్లటి పువ్వులను పెట్టుకోవడం వలన వైవాహిక జీవితంలో సామరస్యం నెలకొంటుంది. ఆనందం పెరుగుతుంది. అదే సమయంలో బెడ్ రూమ్ లో ఒకే బాతు లేదా హంస వంటి ఒకే అలంకరణ వస్తువులను ఉంచడం మానుకోండి. అందుకు బదులుగా జంట పక్షులను ఎంచుకోండి. అవి ప్రేమ, ఐక్యతను సూచిస్తాయి.