
వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదికి ఆగ్నేయ దిశ (అగ్ని కోణం) ఉత్తమంగా పరిగణించబడుతుంది. ఎవరైనా ఉత్తరం లేదా పశ్చిమ దిశలో వంట చేస్తే అగ్ని మూలకం అసమతుల్యమవుతుంది. ఇది మానసిక ఒత్తిడి, వ్యాధులు, కుటుంబ వివాదాలకు దారితీస్తుంది.

తూర్పు దిశ సౌరశక్తికి మూలం. మనం తూర్పు వైపు ముఖం పెట్టి వంట చేసినప్పుడు.. మనకు సానుకూల శక్తి వస్తుంది. వ్యతిరేక దిశలో అంటే పశ్చిమ దిశలో నిలబడటం వల్ల శక్తి ప్రవాహానికి అంతరాయం కలుగుతుంది. దీని వలన సోమరితనం, అలసట, చిరాకు కలుగుతుంది.

తప్పు దిశలో వంట చేయడం వల్ల వంటగదిలో వాస్తు దోషం ఏర్పడుతుంది. ఇది ఇంటి శ్రేయస్సుకి ఆటకం కలిగిస్తుంది. ఆదాయాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. దీని వలన డబ్బు నష్టం, వృధా ఖర్చులు లేదా ఉద్యోగంలో అడ్డంకులు ఏర్పడవచ్చు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఆహారాన్ని వండే దిశను బట్టి ఆహారం ఇచ్చే శక్తి నిర్ణయిస్తుంది. తప్పు దిశలో వండే ఆహారం ప్రతికూల శక్తితో నిండి ఉంటుంది. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యం, మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది.

తప్పుడు దిశ నుంచి ఉత్పన్నమయ్యే ప్రతికూల శక్తి ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. దీని వలన ఇంట్లో సంఘర్షణ, అసమ్మతి , పరస్పర సామరస్యం లోపానికి దారితీస్తుంది.

తప్పుడు దిశలో వంట చేయడం వల్ల మానసిక అస్థిరత, అశాంతి కలుగుతుంది. ఇది వంటగదిలో పనిచేసేటప్పుడు మనస్సులో రకరకాల ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఒకొక్కసారి పనిలో అజాగ్రత్త కలిగి ప్రమాదాలకు దారితీస్తుంది.

వాస్తు శాస్త్రంలో దిశకు మతపరమైన ప్రాముఖ్యత ఉంది. తూర్పు ముఖంగా వంట చేయడం సూర్య భగవానుడి దిశ కనుక ఈ దిశలో నిలబడి వంట చేయడం శుభప్రదంగా భావిస్తారు. దక్షిణం వైపు తిరిగి వంట చేస్తే అది పితృ దోషాన్ని లేదా ప్రతికూల శక్తులను ప్రోత్సహిస్తుంది.