ఈ గుడిలో పూలు కాదు.. గడియారం ఇస్తే మోక్షం! ఎందుకో తెలుసా?

Updated on: Jun 13, 2026 | 7:33 PM

ఎక్కడైనా సరే దేవుడికి కొబ్బరికాయలు, పూలు లేదా ఇష్టమైన ప్రసాదం వంటివి సమర్పిస్తారు. కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్‌గా గోడ గడియారాలు సమర్పిస్తారు. ఈ గుడిలో ఉండే దేవుడికి పూలు కాకుండా, గడియారం ఇస్తే చాలు కోరిన కోర్కె నెరవేరుస్తాడంట. ఇంతకీ ఇది ఏ ఆలయం? ఎక్కడుందో తెలుసుకుందాం.

1 / 5
భారత దేశంలో చాలా శక్తివంతమైన దేవాలయాలు ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లోని  ఘడి బాబా దేవాలయం ప్రత్యేకత గురించి చెప్పా్ల్సిన పని లేదు. ఇక్కడ కొబ్బరికాయ, పూలు కాకుండా,గడియారం సమర్పించడం వలన ఏది కోరినా ఆ కోర్కెలు నెరవేరుతాయంట.

2 / 5
ఉజ్జయిని నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో సగ భైరవ మహారాజ్ కొలువై ఉన్నారని, ఈయన ప్రజల కోర్కెలు తీర్చుతారని, అందుకే ఆయనను భైరవ బాబా రూపంగా భావించి నిత్యం పూజుల చేస్తారంట. ఎవరు అయితే ఆయన్ను స్మరిస్తారో, వారి సమస్యలు తొలిగిపోయి, చాలా ఆనందంగా జీవిస్తారంట.

3 / 5
అయితే ఇక్కడ ఉన్న విశేషం ఏమిటంటే? గడియారాలను సమర్పించడం. అసలు ఈ గుడిలో గడియాలను ఎందుకు సమర్పిస్తారంటే?  ఎవరు అయితే ఏదైనా పని మొదలు పెడితే అది మధ్యలో ఆగిపోతుందో లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు, వివాహం ఆలస్యం, సంతానంలో సమస్యలు ఉన్నవారు ఈ బాబాకు గడియారం సమర్పించడం వలన ఆ సమస్యలు అన్నీ తక్షణమే తొలిగిపోతాయని అక్కడి ప్రజల నమ్మకం. అందుకే ఇక్కడ గడియారం సమర్పిస్తారు.

4 / 5
కొంత మంది కెరీర్ పరంగా కలిసి రావాలని కోరకుంటారు. అంతే కాకుండా ఇలా ఆలయంలోని చెట్టుకు గడియారం సమర్పించడం వలన తమ జీవితాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పుకొస్తుటారు కొందరు భక్తులు. అందువల్లనే చాలా మంది ఈ ఆలయంలోకి వచ్చి గడియారాలను సమర్పిస్తారంట.

5 / 5
అంతే కాకుండా ఇక్కడ ఉన్న మరో స్పెషాలిటీ ఏమిటంటే? ఎక్కడైనా సరే ఆలయంలో పూజారి ఉంటారు.  కానీ ఇక్కడ పూజారి ఉండరు. భక్తులు తమంతట తామే ఆలయంలోకి వచ్చి మొక్కలు చెల్లించుకొని, గడియారాలను సమర్పిస్తారంట.  నోట్ : పై సమాచారం పండితులు, ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

Follow Us