Ugadi 2023 Astrology: శ్రీ శోభకృత్ నామ సంవత్సర రాశిఫలాలు.. ఉగాది నుంచి ఈ రాశుల వారికి అదృష్ట యోగం

|

Mar 22, 2023 | 1:05 AM

తెలుగువారి నూతన సంవత్సర కాలంలో వివిధ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నది ఇక్కడ పరిశీలిద్దాం. ఏప్రిల్ 23 నుంచి గురుగ్రహం మేషరాశిలో సంచారం ప్రారంభిస్తుంది.

1 / 12
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1: ఈ రాశి వారికి ఈ ఏడాదంతా శని 11వ స్థానంలోనూ, గురువు రాశిలోనూ, రాహువు వ్యయం లోనూ, కేతువు 6లోనూ సంచరించడం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. సానుకూల మార్పులు, చేర్పులు జరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంలో చాలావరకు మెరుగుదల కనిపిస్తుంది. రుణ బాధ పూర్తిగా తగ్గిపోతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి.

2 / 12
వృషభ రాశి (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 1: ఈ రాశి వారికి ఏప్రిల్ 23 నుంచి గురువు వ్యయం లోనూ, అక్టోబర్ చివరి వారి నుంచి రాహువు లాభ స్థానంలోనూ, కేతువు పంచమ స్థానం లోనూ సంచరించడం జరుగుతుంది. ఈ ఏడా దంతా శని దశమ స్థానంలో కొనసాగటం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా తిరుగులేని అదృష్టం పట్టడం ఖాయమని చెప్పవచ్చు. ఆదాయానికి, సంపాదనకు, లాభాలకు లోటు ఉండదు కానీ అనవసర ఖర్చులు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. గురు గ్రహం వ్యయ రాశి సంచారం వల్ల డబ్బు విషయంలో మోసపోవటం కానీ, మిత్రుల వల్ల నష్టపోవటం కానీ జరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అయి.

3 / 12
మిథున రాశి (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 4: ఈ ఏడాది భాగ్య స్థానంలో శనీశ్వరుడు, లాభ స్థానంలో గురువు, లాభ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో కేతువు సంచరిస్తున్నందువల్ల, ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయని చెప్పవచ్చు. ఊహించని విధంగా కొన్ని శుభ పరిణామాలు చోటుచేసుకుని జీవితం కొత్త మలుపులు తిరుగుతుంది. మంచి ఉద్యోగం లభించడం లేదా మంచి ఉద్యోగంలోకి వెళ్లడం, తద్వారా జీవితంలో ఆర్థికంగా స్థిర పడటం వంటివి జరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి.

4 / 12
కర్కాటక రాశి (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4: ఈ ఏడాది శని అష్టమంలోనూ, గురువు, రాహువులు దశమంలోనూ, కేతువు చతుర్ధం లోనూ సంచరిస్తున్నందువల్ల ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలను అనుభవించడం జరుగు తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా కష్టపడటం వల్ల కొద్దిపాటి ఫలితం ఉంటుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కోర్టు కేసు ఒకటి సానుకూలపడే అవకాశం ఉంది. దాయాదులతో వివాదాలు కొనసాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా చికాకు కలిగిస్తాయి. అడపాదడపా ఆరోగ్యం చికాకు కలిగిస్తుంది.

5 / 12
సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 7: ఈ రాశి వారికి సప్తమ స్థానంలో శనీశ్వరుడు, నవమ స్థానంలో గురు రాహువులు, మూడవ స్థానంలో కేతువు సంచరిస్తున్నందువల్ల ఈ ఏడాది వీరికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. భాగ్యరాశిలో గురు రాహువుల సంచారం వల్ల వీరికి కొన్ని అనుకోని అదృష్టాలు పట్టడం జరుగుతుంది. ఉద్యోగంలో సంపాదన, వృత్తిలో ఆదాయం, వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో పెరగవచ్చు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు తిరిగి చేతికి వస్తుంది. మొండి బాకీలు వసూలు కావచ్చు. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. ఇవన్నీ మే నెల మొదటి వారం నుంచి ఈ ఏడాది చివరి వరకు కొనసాగటం జరుగుతుంది.

6 / 12
కన్యా రాశి (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7: ఈ ఏడాది ఆరవ స్థానంలో శని, 8వ స్థానంలో గురు రాహువులు, రెండవ స్థానంలో కేతువు సంచరిస్తున్నందువల్ల ఈ రాశి వారికి ఎక్కువగా ప్రతికూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. పని భారం పెరిగి శ్రమ అధికం అవుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు, దుబారా పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారం కావటానికి ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. పిల్లలు బాగా ఒత్తిడికి గురవటం జరుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం ఎక్కువగా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఆస్తి సంబంధమైన వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి.

7 / 12
తులా రాశి (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7: ఈ ఏడాదంతా ఈ రాశి వారికి పంచమంలో శనీశ్వరుడు, సప్తమంలో గురు రాహువులు, మొదటి స్థానంలో కేతువు సంచరించడం వల్ల, జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాల్లో శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టడం ఖాయం అని చెప్పవచ్చు. ఆదాయం, సంపాదన, లాభాలు ఆశించిన స్థాయిలో పెరిగే సూచనలు ఉన్నాయి. అక్రమ సంపాదన విషయంలో అతి జాగ్రత్తగా ఉండటం మంచిది.

8 / 12
వృశ్చిక రాశి (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5: ఈ రాశి వారికి ఈ ఏడాదంతా శనీశ్వరుడు నాలుగవ రాశిలోనూ, గురు రాహువులు ఆరవ రాశిలోనూ, కేతువు వ్యయంలోనూ సంచరిం చడం జరుగుతోంది. దీని ఫలితంగా ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలను అనుభవించడం ఖాయం అని చెప్పవచ్చు. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనులను తరచూ వాయిదా వేయవలసి వస్తుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఉద్యోగం, ఇల్లు మారడం జరుగుతుంది. సహనంతోను, సామరస్యంతోను, సంయమనం తోనూ వ్యవహరించాల్సి ఉంటుంది.

9 / 12
ధనుస్సు రాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3: మూడవ స్థానంలో శని, ఐదవ స్థానంలో గురు రాహువులు, 11వ స్థానంలో కేతు సంచారం వల్ల ఈ ఏడాది ఈ రాశి వారికి జీవితమంతా శుభమయంగా ఉంటుంది. శుభవార్తలు, శుభ పరిణామాలు, శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో సంపాదన బాగా పెరుగుతుంది. సమాజంలో మాటకు విలువ ఉంటుంది. పలుకుబడి కలిగిన వారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంది. సంతాన యోగం కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహిస్తే చాలా బాగుంటుంది.

10 / 12
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2,) ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 6: ధనస్థానంలో శనీశ్వరుడు, సుఖస్థానంలో గురు రాహులు దశమ స్థానంలో కేతువు సంచరిస్తున్నందు వల్ల ఈ రాశి వారు ఈ ఏడాది కొన్ని వ్యక్తిగత సమస్య నుంచి ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. ఒకటి రెండు కుటుంబ సమస్యలు కూడా పరిష్కారమై మనశ్శాంతి ఏర్పడుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగపరంగా పని భారం పెరిగినప్పటికీ ఉద్యోగ జీవితం సంతృప్తి కరంగా సాగిపోతుంది.

11 / 12
కుంభ రాశి (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 6, అవమానం 1: మొదటి రాశిలో శనీశ్వరుడు, మూడవ రాశిలో గురు రాహువులు, భాగ్య స్థానంలో కేతువు సంచరిస్తున్నందువల్ల ఈ ఏడాది ఈ రాశి వారికి సానుకూల పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఆదాయం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు, పని భారం పెరుగుతాయి.

12 / 12
మీన రాశి (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2: వ్యయంలో శని, రెండవ స్థానంలో గురు రాహులు అష్టమంలో కేతువు సంచరిస్తున్నందువల్ల ఈ రాశి వారికి ఈ ఏడాది ఎక్కువగా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయని చెప్పవచ్చు. ఊహించని విధంగా ధన సంపాదన పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆస్తి విలువ రెట్టింపు అవుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో గణనీయంగా మెరుగుదల ఉంటుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. రుణ సమస్యలు బాగా తగ్గుతాయి. వడ్డీ వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. అనవసర ఖర్చుల్ని విలాసాలను బాగా తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది.