- Telugu News Photo Gallery Spiritual photos Three planets in positive position: wish fulfillment for these zodiac signs details in Telugu
Telugu Astrology: మూడు గ్రహాల అనుకూలత.. ఇక ఈ రాశులవారి పంట పండినట్టే..!
Telugu Astrology: కొన్ని రాశులకు ఇది మనసులోని కోరికలు తీరే సమయం. గురు, రవులతో పాటు శుక్రుడు కూడా అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల ఈ నెల (జూన్) 26 తేదీ నుంచి మూడు నెలల పాటు, మేషం, వృషభం, సింహం, కన్య, తుల, మకర రాశుల వారి ఆశలు, ఆశయాలు, కోరికలు చాలా వరకు తీరుతాయి. ఈ రాశుల వారు ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. సమస్యలు, ఒత్తిళ్లు దూరమయ్యే సమయం బాగా దగ్గరపడుతోంది. సూర్యుడిని ఆరాధించడం, విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని పఠించడం వల్ల మరింతగా శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అనుకున్నవన్నీ, ఆశించినవన్నీ జరిగే అవకాశం ఉంది.
Updated on: Jun 21, 2025 | 1:41 PM

మేషం: ఈ రాశివారికి ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించాలన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఆదాయం పెరిగే ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. మరింత మంచి కంపెనీలోకి మారే అవకాశం కలుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆశించిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమయ్యే అవకాశం ఉంది.

వృషభం: ఈ రాశివారికి ఆర్థికంగా స్థిరత్వం సంపాదించాలన్న కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరగడంతో పాటు షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అంచనాలకు మించిన ధన లాభం కలుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుంది. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఘన విజయాలు సాధిస్తారు.

సింహం: ఈ రాశివారికి విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కోరిక నెరవేరే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ప్రభుత్వంలో ఉన్నతస్థాయి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద సరైన ఉద్యోగం లభించడం, అందులో స్థిరపడడం కూడా జరుగుతుంది. సొంత ఇల్లు అమరుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

కన్య: వృత్తి, వ్యాపారాలు అభివృద్ది చెందాలన్న ఈ రాశివారి కోరిక నెరవేరుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా వృద్ధి చెందుతుంది. వీటితో పాటు షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు దాదాపు కనక వర్షం కురిపిస్తాయి. ఆర్థిక వ్యవహారాలన్నీ సవ్యంగా సాగిపోతాయి. విదేశీ సంపాదనకు కూడా అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

తుల: ఈ రాశివారి కోరిక మేరకు ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోగలుగు తారు. పిత్రార్జితం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. తల్లితండ్రులు, తోబుట్టువులతో వివాదాలు సమసిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. రాజపూజ్యాలు వృద్ది చెందుతాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.

మకరం: ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్లాలన్న వీరి కోరిక తప్పకుండా సఫలం అవుతుంది. బాధ్యతలతో పాటు జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. అనేక విధాలుగా బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. సొంత ఇల్లు అమరుతుంది. వాహన యోగం పడుతుంది. ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమై మనశ్శాంతి కలుగుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఇంట్లో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు జరుగుతాయి. ఆస్తి లాభం కూడా కలుగుతుంది.



