- Telugu News Photo Gallery According to Numerology, this is the personality and love life of those whose names start with the letter S
S లెటర్‌తో పేరు మొదలయ్యే వారి లవ్ లైఫ్ ఇదే.. ప్రేమలో పడితే అంతే ఇక!
సంఖ్యాశాస్త్రం ప్రకారం, పుట్టిన తేదీ లేదా, పేరులోని మొదటి అక్షరంతో ఒక వ్యక్తి స్వభావం, వారి కెరీర్, ఫ్యూచర్‌లో వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోవచ్చు అని చెప్తుంటారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. కాగా, మనం నేడు న్యూమరాలజీ ప్రకారం S లెటర్‌తో పేరు మొదలయ్యే వారి కెరీర్, లవ్ లైఫ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Updated on: Jun 21, 2025 | 3:05 PM

చాలా మంది తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పండితుల ద్వారా తెలుసకుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే? వ్యక్తి కెరీర్ పై తన పేరు, పుట్టిన తేదీ కూడా ప్రభావం చూపిస్తుందంట. పేరులో మొదటి అక్షరం బట్టి ఆ వ్యక్తి జీవితం చాలా వరకు తెలుసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. కాగా, ఇప్పుడు మనం Sతో ఎవరి పేరు అయితే మొదలవుతుందో వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం పందండి!

S లెటర్‌తో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా సున్నితమైన వ్యక్తిత్వం కలవారు. చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తారు. కానీ వీరు చాలా మొండివారంట. అనుకున్నది సాధించే వరకు అస్సలే పట్టు వదలరంట. అంతే కాకుండా ఎస్ లెటర్‌తో పేరు మొదలయ్యే వ్యక్తులకు విపరీతమైన కోపం ఉంటుందంట. ఇది వారికి పెద్ద బలహీనత అంటున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. అలాగే వీరికి ఎవరైనా ఏదైనా పని అప్పజెప్తే దానిని చాలా త్వరగా పూర్తి చేస్తారంట. చాలా నిజాయితీ గల వ్యక్తులంట.

అంతే కాకుండా ఎస్ లెటర్‌తో పేరు మొదలయ్యే వ్యక్తులు ఎలాంటి క్లిష్టపరిస్థితినైనా సులభంగా ఎదుర్కొంటారంట. సహాయం చేయడంలో కూడా వీరు ముందుంటారంట. దాన ధర్మాలు చేయడానికి వీరు ఎక్కువ ఆసక్తి చూపుతారంట. అంతే కాకుండా ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు దేనిలో వర్క్ చేసినా సరే, తమ ప్రతిభతో మంచి మార్కులు సంపాదించుకుంటారంట. వీరి కలివిడితనమే వీరికి మంచి చేస్తుందంట.

ఇక S లెటర్ తో పేరు మొదలయ్యే వారి ప్రేమ విషయానికి వస్తే. వీరిని లవ్ చేసే వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీరు తమ ప్రేమికుడు లేదా ప్రేయసిపై విపరీతమైన ప్రేమను చూపిస్తారంట. కష్టంలో,నష్టంలో వారికి తోడుగా నిలుస్తారంట. వీరు నిజమైన ప్రేమను అందిస్తారంట. కానీ కొన్ని సార్లు వీరి ప్రేమ వృధా అయ్యే అవకాశం ఉంటుందంట. అంటే వీరు ఎంత నిజంగా ప్రేమను అందిస్తారో.. అవతలి వారి నుంచి అంత ప్రేమ ఉండకపోవచ్చు, కొన్ని సార్లు ప్రేమలో మోసపోవడం కూడా జరగచ్చు అంటున్నారు నిపుణులు.

ఇక ఈ ఎస్ లెటర్‌తో పేరు ప్రారంభమయ్యే వారి వివాహ జీవితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందంట. చాలా ఆనందంగా జీవితాన్ని సాగిస్తారంట. కొన్ని సార్లు అనుకోని సంఘటనలు ఎదురైనప్పటికీ, వాటి నుంచి బయటపడి తమ లైఫ్‌ను సంతోషంగా లీడ్ చేస్తారని చెప్తున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు.



