Zodiac Signs: శని, శుక్ర గ్రహాల పరస్పర వీక్షణ ప్రభావం.. వారి జీవితంలో ప్రశాంతత నెలకొనడం పక్కా.. ! మీకు ఎలా ఉంటుందంటే..?

| Edited By: Janardhan Veluru

Jul 12, 2023 | 7:38 PM

జ్యోతిష శాస్త్రం ప్రకారం, శని, శుక్ర గ్రహాలు పరస్పరం వీక్షించుకున్న పక్షంలో జీవితంలో ఒక విధమైన స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శనీశ్వరుడు సింహరాశిలో ఉన్న శుక్రుడితో పరస్పర వీక్షణ కలిగి ఉండడం వల్ల జీవితంలో కొన్ని అంశాలకు సంబంధించి ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి.

1 / 13
జ్యోతిష శాస్త్రం ప్రకారం, శని, శుక్ర గ్రహాలు పరస్పరం వీక్షించుకున్న పక్షంలో జీవితంలో ఒక విధమైన స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శనీశ్వరుడు సింహరాశిలో ఉన్న శుక్రుడితో పరస్పర వీక్షణ కలిగి ఉండడం వల్ల జీవితంలో కొన్ని అంశాలకు సంబంధించి ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగంలో కానీ, కుటుంబంలో కానీ, ప్రేమ వ్యవహారాలలో కానీ, వ్యక్తిగతంగా కానీ ముఖ్యమైన సమస్యల ప్రభావం బాగా తగ్గిపోయి కొద్దిగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకపోవచ్చు. కానీ, వాటి వల్ల ఏర్పడే ఒత్తిడి తగ్గడం, సమస్యల తీవ్రత తగ్గుముఖం పట్టడం వంటివి చోటు చేసుకుంటాయి. శని, శుక్ర గ్రహాలు మంచి స్నేహితులు. అందువల్ల ఈ పరస్పర వీక్షణ వల్ల వీలైనంతగా శుభమే జరుగుతుంది. ఈ పరిస్థితి ఆగస్టు 8వ తేదీ వరకు కొనసాగుతుంది.

2 / 13
మేషం: ఈ రాశి వారికి అయిదవ స్థానంలో అంటే ఆలోచనా స్థానంలో శుక్ర సంచారం జరుగుతుండడం, దానిని శని వీక్షించడం వల్ల కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే అవి బాగా తగ్గుముఖం పడతాయి. దంపతుల మధ్య సమస్యలున్నా, దాంపత్య జీవితంలో సమస్యలున్నా అవి వీలైనంతగా తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కూడా కొన్ని ప్రధాన సమస్యలు దాదాపు సమసిపోవడం జరుగుతుంది. ఈ రెండు మిత్ర గ్రహాలు పరస్పరం వీక్షించుకోవడం వల్ల ఈ రాశివారికి ధనయోగం పట్టే అవకాశం కూడా ఉంటుంది.

3 / 13
వృషభం: ఈ రాశివారికి ఈ శుక్ర, శనుల వీక్షణ వల్ల ఉద్యోగ, విద్యా సంబంధమైన సమస్యలు, చికాకులు చాలావరకు తొలగిపోయే అవకాశం ఉంది. కుటుంబపరంగా చాలా కాలం నుంచి వేధిస్తున్న సమస్యలు కూడా బాగా తగ్గుముఖం పట్టడం జరుగుతుంది. ఆస్తి సంబంధమైన సమస్యలు, గృహ, వాహన సంబంధమైన ఆటంకాలు తొలగిపోయి, ఇంట్లో సౌకర్యాలు పెరుగుతాయి. మనశ్శాంతి ఏర్పడుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. పిల్లల నుంచి లేదా కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వినడం కూడా జరుగుతుంది.

4 / 13
మిథునం: తోబుట్టువులతో అభిప్రాయభేదాలు, వివాదాలు, సన్నిహితులతో మాట పట్టింపులు వంటివి వెనుకపట్టు పడతాయి. వీరి మధ్య ఊహించని స్థాయిలో సఖ్యత
పెరుగుతుంది. ఈ పరస్పర వీక్షణ వల్ల తప్పకుండా ధనవృద్ధి ఉంటుంది. ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సంతానం కలిగే సూచనలు కూడా ఉన్నాయి.
ఇష్టమైన ఆలయాలు సందర్శించడం, మొక్కులు తీర్చుకోవడం వంటివి కూడా పూర్తవుతాయి. నిర్ణయాలను అమలు చేయడంలో ఎదురవుతున్న ఆటంకాలు కూడా తొలగే అవకాశం ఉంది.

మిథునం: తోబుట్టువులతో అభిప్రాయభేదాలు, వివాదాలు, సన్నిహితులతో మాట పట్టింపులు వంటివి వెనుకపట్టు పడతాయి. వీరి మధ్య ఊహించని స్థాయిలో సఖ్యత పెరుగుతుంది. ఈ పరస్పర వీక్షణ వల్ల తప్పకుండా ధనవృద్ధి ఉంటుంది. ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సంతానం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. ఇష్టమైన ఆలయాలు సందర్శించడం, మొక్కులు తీర్చుకోవడం వంటివి కూడా పూర్తవుతాయి. నిర్ణయాలను అమలు చేయడంలో ఎదురవుతున్న ఆటంకాలు కూడా తొలగే అవకాశం ఉంది.

5 / 13
కర్కాటకం: ఈ పరస్పర వీక్షణ వల్ల ధన వృద్ధికి, ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఇతరులకు సహాయం చేయగల పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడవచ్చు. ఆర్థిక ప్రయత్నాలు సఫలం కావడం, ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. ఇదివరకు చులకనగా చూసినవారే ఇప్పుడు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభిస్తారు. వేషభాషల్లో మంచి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

6 / 13
సింహం: ఈ రాశిలో ఉన్న శుక్రుడి మీద శనీశ్వరుడి దృష్టి పడినందువల్ల, అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరం కావడం జరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగంలోనూ, కుటుంబంలోనూ హోదా కూడా పెరుగుతుంది. కుటుంబంలో సంతానపరంగా అభివృద్ధి చోటు చేసుకుంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లల పరంగా మనశ్శాంతి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఆదరణ పెరుగుతుంది.

7 / 13
కన్య: ఈ రాశివారికి విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలు, అవరోధాలు తొలగిపోవచ్చు. విదేశాల్లో ఉన్న పిల్లలను చూడడానికి వెళ్లే అవకాశం ఉంది. పిల్లలు
చూడడానికి వచ్చే అవకాశం కూడా ఉంది. విదేశాల్లో చదువులు, ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలు తగ్గిపోవడం జరుగుతుంది. వారసత్వపు ఆస్తికి సంబంధించిన
చికాకులు, ఇబ్బందులు కూడా రాజీమార్గంగా పరిష్కారం అవుతాయి. కుటుంబంలోని పెద్దల వల్ల ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. తల్లితండ్రులతో వివాదాలు
సమసిపోతాయి. సామరస్యం పెరుగుతుంది.

కన్య: ఈ రాశివారికి విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలు, అవరోధాలు తొలగిపోవచ్చు. విదేశాల్లో ఉన్న పిల్లలను చూడడానికి వెళ్లే అవకాశం ఉంది. పిల్లలు చూడడానికి వచ్చే అవకాశం కూడా ఉంది. విదేశాల్లో చదువులు, ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలు తగ్గిపోవడం జరుగుతుంది. వారసత్వపు ఆస్తికి సంబంధించిన చికాకులు, ఇబ్బందులు కూడా రాజీమార్గంగా పరిష్కారం అవుతాయి. కుటుంబంలోని పెద్దల వల్ల ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. తల్లితండ్రులతో వివాదాలు సమసిపోతాయి. సామరస్యం పెరుగుతుంది.

8 / 13
తుల: తోబుట్టువులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా జ్యేష్ఠ సోదరుల వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. పుణ్యక్షేత్రాల సందర్శనకు అవకాశం కలుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోయే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలలో ఏర్పడుతున్న అవరోధాలు తప్పకుండా తొలగిపోతాయి. శుభకార్యాలకు, శుభవార్తలకు, శుభ పరిణామాలకు అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభానికి, అప్రయత్న ధన వృద్ధికి అవకాశం ఉంది.

9 / 13
వృశ్చికం: వృత్తి ఉద్యోగాలలో పురోగతికి సంబంధించి ఏవైనా ఆటంకాలు, అవరోధాలు, సమస్యలు ఉన్నపక్షంలో అవి చాలావరకు తొలగిపోయి మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగ స్థానంలో సహచరుల నుంచి కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు ఉన్నపక్షంలో అవన్నీ తగ్గిపోయి, సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగంలో అధికారులకు లేదా యజమానులకు సన్నిహితం అయ్యే అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి కొద్దిగానైనా విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆస్తి వివాదం సానుకూలపడుతుంది.

10 / 13
ధనుస్సు: విదేశీయానానికి సంబంధించిన చిన్నా చితకా సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. గ్రీన్ కార్డు వంటి వాటికి మార్గం సుగమం అవుతుంది. వారసత్వ సంపదకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. పితృవర్గం వైపు వారి నుంచి సానుకూలత లభిస్తుంది. ఉన్నత విద్యలకు అవకాశాలు మెరుగుపడతాయి. కుటుంబానికి సంబంధించిన ఆందోళనలు తగ్గిపోతాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనాలుంటాయి. కనిష్ట సోదరులకు అండగా నిలబడతారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. తల్లితండ్రుల ఆరోగ్యం కుదుటపడుతుంది.

11 / 13
మకరం: ఆర్థిక పరిస్థితిలో స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి ఏ ప్రయత్నమైనా అనుకూలమవుతుంది. అధికారులతో
వివాదాలు, అపార్థాలు తగ్గిపోతాయి. ఉద్యోగంలోనే కాకుండా, కుటుంబంలో కూడా ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల దగ్గరకు
వెళ్లడం కానీ, వాళ్లు మీ దగ్గరికి రావడం గానీ జరుగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు చాలావరకు అదుపులో
ఉంటాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

మకరం: ఆర్థిక పరిస్థితిలో స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి ఏ ప్రయత్నమైనా అనుకూలమవుతుంది. అధికారులతో వివాదాలు, అపార్థాలు తగ్గిపోతాయి. ఉద్యోగంలోనే కాకుండా, కుటుంబంలో కూడా ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల దగ్గరకు వెళ్లడం కానీ, వాళ్లు మీ దగ్గరికి రావడం గానీ జరుగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు చాలావరకు అదుపులో ఉంటాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

12 / 13
కుంభం: దాంపత్య జీవితంలోని సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. విడాకులకు దారితీసిన కేసులు సైతం రాజీమార్గంతో ఒక్కటవుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లోని విభేదాలు, వివాదాలు దాదాపు తగ్గిపోతాయి. వృత్తి, ఉద్యోగాలు సామరస్యంగా సాగిపోతాయి. ఉద్యోగంలో బెంచి మీద ఉన్నవారు కూడా ప్రధాన జీవన స్రవంతిలో కలిసిపోయే అవకాశం ఉంది. గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించిన ప్రతిబంధకాలు తొలగిపోతాయి. పిల్లల్లో ఒకరికి నిరుద్యోగ సమస్య పరిష్కారం అయి, దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

13 / 13
మీనం: ఈ రాశివారికి ఏలిన్నాటి శని ప్రభావం తగ్గే అవకాశం ఉంది. ఆరవ స్థానంలో సంచరిస్తున్న శుక్ర గ్రహం వల్ల శత్రువులు కూడా మిత్రులుగా మారి సహకరించే
సూచనలున్నాయి. అనారోగ్యం నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. వైద్య ఖర్చులు బాగా తగ్గిపోతాయి. నిరుద్యోగ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
ఆర్థిక సమస్యల నుంచి కొంత వరకు విముక్తి లభించవచ్చు. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తి నిపుణులకు గుర్తింపు లభించి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మీనం: ఈ రాశివారికి ఏలిన్నాటి శని ప్రభావం తగ్గే అవకాశం ఉంది. ఆరవ స్థానంలో సంచరిస్తున్న శుక్ర గ్రహం వల్ల శత్రువులు కూడా మిత్రులుగా మారి సహకరించే సూచనలున్నాయి. అనారోగ్యం నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. వైద్య ఖర్చులు బాగా తగ్గిపోతాయి. నిరుద్యోగ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి కొంత వరకు విముక్తి లభించవచ్చు. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తి నిపుణులకు గుర్తింపు లభించి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.