
మేషం: ఈ రాశిలో తృతీయ స్థానంలో గురువు, లాభ స్థానంలో రాహువు సంచారం చేస్తుండడం, నాలుగు గ్రహాలు అనుకూలంగా మారుతుండడం వల్ల వీరికి త్వరలో దశ తిరిగే అవకాశం ఉంది. అనేక విధాలుగా అదృష్టం తలుపు తడుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల విపరీతంగా లాభాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. అనేక మార్గాల్లో సంపాదించడానికి, ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఆస్తి కలిసి రావడం, ఆస్తి విలువ పెరగడం వంటివి జరుగుతాయి.

వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో శనీశ్వరుడు, దశమంలో రాహువు, సప్తమ స్థానంలో శుక్ర, బుధ, రవుల సంచారం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నిస్తే అంతమంచిది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. భాగ్యవంతులు కావడానికి అనేక అవకాశాలు లభిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. పిత్రార్జితం కలిసి వస్తుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి.

సింహం: ఈ రాశివారికి ధన కారకుడు గురువు, ధనాధిపతి బుధుడితో పాటు, రాశ్యధిపతి రవి, శుక్రుడు, కుజుడు బాగా అనుకూలంగా ఉండడం వల్ల వచ్చే రెండు నెలల కాలంలో అనేక పర్యాయాలు, అనేక విధాలుగా సంపద వృద్ధి చెందడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తాయి. ఉద్యోగంలో సంపాదన పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. దేనికీ లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది.

తుల: ఈ రాశికి ధన స్థానంలో మూడు గ్రహాలు, షష్ట స్థానంలో శని, భాగ్య స్థానంలో గురువు సంచారం వల్ల అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. మదుపులు, పెట్టుబడులు రెట్టింపు ఫలితాలనిస్తాయి. ఆస్తి కలిసి రావడం, లాటరీలు, స్పెక్యులేషన్ వ్యాపారాల్లో విజయాలు సాధించడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల పంట పండిస్తాయి. ఉద్యోగాల్లో జీతభత్యాలతో పాటు అదనపు రాబడి కూడా బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.

మకరం: ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన శనీశ్వరుడు తృతీయ స్థానంలోనే ఉండడం, లాభ స్థానంలో మూడు గ్రహాలు, ధన స్థానంలో రాహువు ఉండడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా ధన యోగా లతో పాటు ఐశ్వర్య యోగం కూడా పడుతుంది. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లలో విజయాలు సాధిస్తారు.