Varanasi: కాశీలో చితి ఆరదు.. ఈ ఐదుగురు వ్యక్తులను దహనం చేయరు? ఎందుకో తెలుసా..!

Updated on: Sep 10, 2025 | 8:10 AM

హిందూ మతంలో కాశీని 'మోక్షానికి ద్వారం'గా పరిగణిస్తారు, ఇక్కడ శివుడు స్వయంగా నివసిస్తాడు. ఇక్కడ మరణించిన జీవులకు జనన మరణ చక్రం నుంచి విముక్తిని ఇస్తాడు. ఈ నగరంలో చితి మంటలు 24 గంటలు మండుతూనే ఉంటాయి. మృత దేహాలను దహనం చేస్తూనే ఉంటారు. ఇక్కడ అనేక ఘాట్‌లు ఉన్నాయి. అయితే ఈ నగరంలో 5 మందిని మాత్రం దహనం చేయరు.

1 / 6
మోక్ష నగరం అని పిలువబడే కాశీకి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివుడు స్వయంగా కాశీలో నివసిస్తాడని.. ఇక్కడ మరణించి వారికీ మోక్షం లభిస్తుందని చెబుతారు. కాశీలో 24 గంటలూ చితి మండే అనేక ఘాట్‌లు ఉన్నాయి. అయితే ఇక్కడ ఐదుగురు వ్యక్తుల దహన సంస్కారాలు జరగవు. దీని వెనుక గల కారణాన్ని గరుడ పురాణంలో కూడా వివరించబడింది. కాశీలో ఎవరి దహన సంస్కారాలు జరగవు, దీని వెనుక ఉన్న కారణం గురించి తెలుసుకుందాం..

మోక్ష నగరం అని పిలువబడే కాశీకి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివుడు స్వయంగా కాశీలో నివసిస్తాడని.. ఇక్కడ మరణించి వారికీ మోక్షం లభిస్తుందని చెబుతారు. కాశీలో 24 గంటలూ చితి మండే అనేక ఘాట్‌లు ఉన్నాయి. అయితే ఇక్కడ ఐదుగురు వ్యక్తుల దహన సంస్కారాలు జరగవు. దీని వెనుక గల కారణాన్ని గరుడ పురాణంలో కూడా వివరించబడింది. కాశీలో ఎవరి దహన సంస్కారాలు జరగవు, దీని వెనుక ఉన్న కారణం గురించి తెలుసుకుందాం..

2 / 6
ఋషులు, సాధువులు
గరుడ పురాణం ప్రకారం సాధువులు, ఋషుల శరీరాలను ఎప్పుడూ దహనం చేయరు. కాశీలో ఒక సాధువు శరీరానికి జల సమాధి లేదా తహ్లీ సమాధిని ఇచ్చే సంప్రదాయం ఉంది. ఎందుకంటే వారు అప్పటికే గృహస్థ ఆశ్రమాన్ని, అన్ని ప్రాపంచిక సుఖాలను త్యజించారు.

ఋషులు, సాధువులు గరుడ పురాణం ప్రకారం సాధువులు, ఋషుల శరీరాలను ఎప్పుడూ దహనం చేయరు. కాశీలో ఒక సాధువు శరీరానికి జల సమాధి లేదా తహ్లీ సమాధిని ఇచ్చే సంప్రదాయం ఉంది. ఎందుకంటే వారు అప్పటికే గృహస్థ ఆశ్రమాన్ని, అన్ని ప్రాపంచిక సుఖాలను త్యజించారు.

3 / 6
11 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు
కాశీలో చిన్న పిల్లల మృతదేహాలను దహనం చేయరు. దీనికి కారణం గరుడ పురాణ నియమం. గరుడ పురాణం ప్రకారం, 11 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లవాడు మరణిస్తే, అతని మృతదేహాన్ని దహనం చేయరు. అలాంటి పిల్లలను సమాధి చేస్తారు.

11 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కాశీలో చిన్న పిల్లల మృతదేహాలను దహనం చేయరు. దీనికి కారణం గరుడ పురాణ నియమం. గరుడ పురాణం ప్రకారం, 11 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లవాడు మరణిస్తే, అతని మృతదేహాన్ని దహనం చేయరు. అలాంటి పిల్లలను సమాధి చేస్తారు.

4 / 6
గర్భిణీ స్త్రీలు
గరుడ పురాణం ప్రకారం గర్భిణీ స్త్రీ శవాన్ని కాశీలో దహనం చేయరు. దీని వెనుక కారణం ఏమిటంటే గర్భిణీ స్త్రీ కడుపు ఉబ్బిపోయి, చితి మంట కారణంగా కడుపు పగిలిపోయే అవకాశం ఉంది. కనుక గర్భిణీ స్త్రీ శవాన్ని కాశీలో దహనం చేయరు. గర్భిణీ స్త్రీకి జల లేదా తహ్లీ సమాధి చేయాలనే నియమం ఉండటానికి ఇదే కారణం.

గర్భిణీ స్త్రీలు గరుడ పురాణం ప్రకారం గర్భిణీ స్త్రీ శవాన్ని కాశీలో దహనం చేయరు. దీని వెనుక కారణం ఏమిటంటే గర్భిణీ స్త్రీ కడుపు ఉబ్బిపోయి, చితి మంట కారణంగా కడుపు పగిలిపోయే అవకాశం ఉంది. కనుక గర్భిణీ స్త్రీ శవాన్ని కాశీలో దహనం చేయరు. గర్భిణీ స్త్రీకి జల లేదా తహ్లీ సమాధి చేయాలనే నియమం ఉండటానికి ఇదే కారణం.

5 / 6
పాము కాటుకు గురైన వ్యక్తులు
కాశీలో పాము కాటు వల్ల మరణించిన వ్యక్తిని దహనం చేయరని ఒక నమ్మకం ఉంది. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి పాము కాటు లేదా విషం కాటు కారణంగా మరణిస్తే.. అతని శరీరం కూడా దహనం చేయబడదు. అలాంటి వ్యక్తి శరీరంలో 21 రోజులు సూక్ష్మ జీవం ఉంటుందని, అంటే అతను పూర్తిగా మరణించడని చెబుతారు. కనుక అలాంటి వారిని భూమిలో సమాధి చేసే నియమం ఉంది.

పాము కాటుకు గురైన వ్యక్తులు కాశీలో పాము కాటు వల్ల మరణించిన వ్యక్తిని దహనం చేయరని ఒక నమ్మకం ఉంది. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి పాము కాటు లేదా విషం కాటు కారణంగా మరణిస్తే.. అతని శరీరం కూడా దహనం చేయబడదు. అలాంటి వ్యక్తి శరీరంలో 21 రోజులు సూక్ష్మ జీవం ఉంటుందని, అంటే అతను పూర్తిగా మరణించడని చెబుతారు. కనుక అలాంటి వారిని భూమిలో సమాధి చేసే నియమం ఉంది.

6 / 6
అంటు వ్యాధి ఉన్న వ్యక్తులను 
హిందూ మత విశ్వాసాల ప్రకారం కుష్టు వ్యాధి లేదా చర్మ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి కాశీలో మరణిస్తే.. అతని మృతదేహాన్ని దహనం చేయరు. గరుడ పురాణం ప్రకారం అటువంటి వ్యక్తులకు భూమిలో ఖననం చేసే సంప్రదాయం ఉంది. అంటు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి మృతదేహాన్ని దహనం చేస్తే.. గాలిలో బ్యాక్టీరియా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని..  అందువల్ల అలాంటి వారిని కాశీలో దహనం చేయరని చెబుతారు.

అంటు వ్యాధి ఉన్న వ్యక్తులను హిందూ మత విశ్వాసాల ప్రకారం కుష్టు వ్యాధి లేదా చర్మ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి కాశీలో మరణిస్తే.. అతని మృతదేహాన్ని దహనం చేయరు. గరుడ పురాణం ప్రకారం అటువంటి వ్యక్తులకు భూమిలో ఖననం చేసే సంప్రదాయం ఉంది. అంటు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి మృతదేహాన్ని దహనం చేస్తే.. గాలిలో బ్యాక్టీరియా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని.. అందువల్ల అలాంటి వారిని కాశీలో దహనం చేయరని చెబుతారు.