
యోగిని ఏకాదశి.. (జూలై 5) జూలై 5న యోగిని ఏకాదశి. ఈరోజున విష్ణు మూర్తిని పూజించడమే కాకుండా.. ఉపవాసాలు ఉంటారు. ప్రతి నెలలో ఏకాదశులు వస్తుంటాయి. అందులో యోగిని ఏకాదశి ఒకటి.

ప్రదోష వ్రతం (జూలై 7) ప్రదోష వ్రతం అంటే.. ఆ రోజున శివుడిని పూజిస్తారు. అనంతరం ఉపవాస దీక్షను పాటిస్తారు. ఇక ఈ ఉపవాసాన్ని బుధవారం పాటిస్తే.. బుద్ ప్రదోష వ్రతం అంటారు. ఈరోజు ఉపవాసం చేస్తే మోక్షాన్ని పొందుతారట.

శివరాత్రి వ్రతం (జూలై 8) ప్రతి నెల కృష్ణ పక్షంలోని చతుర్థశి తిథిని నెలవారీ శివరాత్రి అంటారు. సంవత్సరంలో మొత్తం 12 శివరాత్రులు వస్తాయి. ఈ వారంలో గురువారం శివారత్రి ఉపవాసం వచ్చింది. ఈరోజున శివుడిని ఆరాధించి.. ఉపవాసం చేయడం వలన ఆనందం, శ్రేయస్సు సాధించవచ్చు.

ఆషాడ అమావాస్య (జూలై 9) ఆషాడ కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యను శ్రాద్ అమావాస్యగా జరుపుకుంటారు. ఈ వారంలో శుక్రవారం ఆషాడ అమావాస్య వచ్చింది. ఈరోజు పితృకర్మలు చేస్తారు. పూర్వీకుల శాంతి కోసం పేదలకు ఆహారాన్ని దానం చేస్తారు.

ఈ వారంలో ఉన్న పండుగలు...