Yellakonda Shiva Temple: తెలంగాణ శ్రీశైలంగా ఖ్యాతిగాంచిన శివాలయం ఎక్కడ ఉందో తెలుసా..

|

Aug 12, 2021 | 12:07 PM

Yellakonda Shiva Temple: భారత దేశం ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ గుడులు గోపురాలకు కొదువ లేదు. స్వయం భూ దేవాలయాలతో పాటు.. రాజ వంశీకుల కాలాల్లో అనేక మంది పాలకులు అనేక ఆలయాలను నిర్మించారు. ఆ ఆలయాల పోషణార్థం, మడులను, మాన్యాలను ఏర్పాటు చేశారు. వాటిల్లో ఒకటి కాకతీయ కాలం నాటి శివాలయం వికారాబాద్ జిల్లాలోని నవాబ్‌పేట్ మండలం యెల్లకొండ గ్రామంలో ఉంది.

1 / 5
కాకతీయుల కాలంలో నిర్మింపబడిన ఎల్లకొండ శివాలయం.. తెలంగాణా శ్రీశైలంగా ప్రసిద్ధి. ఈ శివాలయానికి సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. కాకతీయుల కాలం లో నిర్మించిన అనేక శివాలయాల్లో ఇది ఒకటి.. ఈ ఆలయ నిర్మాణం కూడా రామప్ప దేవాలయం శైలిలో ఉండి ఎంతో అందంగా, మనసుని ఆకట్టుకుంటుంది.

2 / 5
పూర్వం ఒక ముని కొండపై తపస్సు చేస్తున్న సమయం లో ఆకాశయానం  చేస్తున్న శివపార్వతులు ఆ ముని తపస్సుకి పరవశించి  కొండపైన దిగి దర్శనం ఇచ్చినట్లు పురాణాల కథనం.. అందుకనే ఈ కొండ వెండి కొండగా ప్రసిద్ది చెందింది.. కాలక్రమేణా ఎల్లకొండగా మారింది అని స్థానికుల కథనం

3 / 5
కొండ పైన శివాలయం, కొండకు దిగువ భాగాన శంబుని ఆలయం ఉంది. ఆలయ మండపం దీర్ఘచతురస్రాకారంలో నిర్మించబడింది. ఇక మండపంలోని పై కప్పులు అష్టదిక్పాలకులతో చెక్కబడ్డాయి. ఆలయం ముందు ఒక అందమైన ఏడు కవచాల నాగిని శిల్పం ఆకర్షణీయంగా ఉంటుంది.

4 / 5
ఆలయ నిర్మాణాన్ని బట్టి చుస్తే  కాకతీయుల కాలం  లో నిర్మించారు అని పురావస్తు శాఖవారి అభిప్రాయం. శివాలయం మండపంలోని పై కప్పులు అష్టదిక్పాలకులతో చెక్కబడ్డాయి. ఆలయం ముందు ఒక అందమైన ఏడు కవచాల నాగిని శిల్పం ఆకర్షణీయంగా ఉంటుంది.

5 / 5
ఎల్లకొండ గ్రామం హైదరాబాద్ జిల్లా కేంద్రం నుండి శంకర్‌పల్లి రోడ్డు మీదుగా దాదాపు 57 కిమీ దూరంలో ఉంది. వికారాబాద్ నుంచి బస్సు సర్వీస్ లు ఈ  గ్రామానికి ఉంటాయి