
శ్రీ మహా విష్ణువు అవతారం అయిన శ్రీ కృష్ణుడి పుట్టినరోజే.. శ్రీకృష్ణ జన్మాష్టమి. ఏటా శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిధి రోహిణి నక్షత్రం రోజు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తారు.

చిన్నారి కన్నయ్యను తమ ఇంటికి ఆహ్వానిస్తూ చిన్న చిన్న పాదాలను ముద్రిస్తారు. బాల కృష్ణుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఊయలలో బాల కృష్ణుడికి పూజలు చేస్తారు.

అయితే కృష్ణాష్టమి రోజు చిన్న పిల్లల సందడి అంతా ఇంత కాదు. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్లు.. తమ బిడ్డలను కన్నయ్యలా అలంకరించి.. మురిసిపోతారు.

చిటిపొట్టి చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలకు కృష్ణుడు, గోపిలు, యశోద వంటి వేషధారణలతో కృష్ణాష్టమి సంబరాలను జరుపుకుంటున్నారు.

మగ పిల్లలకు కృష్ణుడి వేషం, ఆడ పిల్లలను గోపికలా తయారుచేసి సంతోషిస్తారు తల్లిదండ్రులు

కొన్ని ప్రాంతాల్లో స్కూల్స్ లో కూడా కృష్ణాష్టమి సంబరాలను నిర్వహిస్తారు. తమ స్టూడెంట్స్ కు కృష్ణుడి గోపికల వేషాలు వేసి వేడుకలను జరుపుతారు కూడా.

కృష్ణ జన్మాష్టమి పండుగను పురస్కరించుకుని కృష్ణుడి వేషధారణలో చిన్నారి బాల బాలికలు సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటున్నారు.

అయితే కృష్ణాష్టమి సందర్భంగా వేడుకలతో పాటు ఇక చాలా చోట్ల సాయంత్రం వేళ ఉట్టికొట్టే కార్యక్రమం ఉంటుంది.

తెలుగు సంస్కృతి, సాంప్రదాయంలో కన్నయ్య, రాధా గోపికలుగా సంప్రదాయ వేషధారణలతో ఉట్టికొడుతూ సందడి చేస్తున్నారు. ఆధ్యాత్మికంగా ఆనందంగా ఈ పండగను ఘనంగా జరుపుకుంటున్నారు.