లడ్డూ గోపాల విగ్రహం: పవిత్రమైన జన్మాష్టమి రోజున కన్నయ్య భక్తులు తమ బిడ్డ రూపంలో అంటే లడ్డూ గోపాలుడిగా పూజించటానికి ఇష్టపడతారు. హిందూ విశ్వాసం ప్రకారం శ్రీ కృష్ణుడిని పవిత్ర రూపాన్ని పూజించడం దురదృష్టాన్ని తొలగించి, అదృష్టాన్ని పెంచుతుందని భావిస్తారు. దీంతో పాటు లడ్డూ గోపాల్‌ని పూజించడం వల్ల పిల్లలకు కూడా ఆనందం కలుగుతుంది. బాల-గోపాలుని విగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పూజించడానికి ఇష్టపడటానికి ఇదే కారణం
గోవర్ధన గిరిని ఎత్తే కృష్ణుడి విగ్రహం: హిందూ విశ్వాసం ప్రకారం వివిధ రకాలైన కృష్ణుడి విగ్రహాలున్నా.. గోవర్ధన పర్వతాన్ని ఎత్తే విగ్రహం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. హిందువుల విశ్వాసం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో ఏ రకమైన భయం ఉన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా వాటిని తొలగించడానికి గోవర్ధన పర్వతంపై ఉన్న శ్రీకృష్ణుని విగ్రహానికి జన్మాష్టమి రోజున ప్రత్యేకంగా పూజను చేయాలి.
రాధాకృష్ణుడి విగ్రహం: హిందూ విశ్వాసం ప్రకారం రాధా రాణి లేకుండా శ్రీకృష్ణుడు అసంపూర్ణంగా పరిగణించబడతాడు. రాధా-కృష్ణుల విగ్రహాన్ని పూజించడం ద్వారా ఎవరైనా సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని, అదృష్టాన్ని పొందుతాడని.. భార్యాభర్తల మధ్య పరస్పర విశ్వాసం.. ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుందని నమ్మకం.
వెన్న దొంగిలించే కన్నయ్య విగ్రహం: శ్రీ కృష్ణుడి వెన్న దొంగ దొంగిలించే రూపాన్ని పూజించడం కూడా చాలా పుణ్యమైనదిగా పరిగణించబడుతుంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు బాల గోపాలుడు వెన్న దొంగిలించేవాడని.. తాను దొంగలించిన వెన్నను తన తోటివారికి పంచేవాడు. ఇలా వెన్నను దొంగిలించి ఇతరులకు పెట్టడం ద్వారా.. మనకున్నది నలుగురికివ్వడం వల్ల కలిగే సంతోషం ఎలా ఉంటుందో మనిషికి చేసి చూపించాడు. హిందూ విశ్వాసం ప్రకారం ఈ కృష్ణుడి విగ్రహాన్ని పూజిస్తే.. భక్తుడి ఇంట్లో ఎప్పుడూ ఆహారం, డబ్బు నిల్వ ఉంటుంది.
కన్నయ్య విగ్రహానికి సంబంధించిన నియమాలు: హిందూ విశ్వాసం ప్రకారం ఇంట్లో విష్ణువు లేదా అతని అవతారమైన కృష్ణుడి విగ్రహం లేదా శాలిగ్రామం ఉంటే ప్రతిరోజూ స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత.. వాటిని పూజించాలి. అనంతరం ఆవు పాలతో చేసిన స్వచ్ఛమైన నెయ్యి దీపాన్ని వెలిగించాలి. దీనితో పాటు ప్రతిరోజూ దేవునికి నైవేద్యంగా పెట్టిన తర్వాతే ఆహారం తీసుకోవాలి. భగవంతుడికి నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తులసి దళం వేసి మాత్రమే సమర్పించాలి. శ్రీకృష్ణుని పూజించేటప్పుడు పరిశుభ్రత , స్వచ్ఛత గురించి పూర్తి శ్రద్ధ వహించాలి.