
మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి దిగ్బల యోగం కూడా పట్టింది. దీనివల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా, సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. రాజపూజ్యాలు ఎక్కువగా కలుగుతాయి. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సొంత ఇల్లు అమరే అవకాశం ఉంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు దాదాపు పూర్తిగా తగ్గిపోతాయి.

మిథునం: ఈ రాశికి ధన స్థానంలో శుక్రుడి ప్రవేశం వల్ల ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుంది. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.

కర్కాటకం: ఈ రాశిలో శుక్రుడి సంచారం వల్ల సంపద బాగా వృద్ధి చెందుతుంది. విలాస జీవితాన్ని అనుభవిస్తారు. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. సంతాన యోగం కలుగుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.

కన్య: ఈ రాశికి ధన, భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన శుక్రుడు లాభస్థానంలో సంచారం చేయడం వల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. అదనపు ఆదాయానికి లోటుండదు. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది.

తుల: రాశ్యధిపతి శుక్రుడు దశమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాలు పెరగడానికి, ఇష్టమైన ప్రాంతానికి బదిలీ కావడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాల బాట పడతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది.

మకరం: ఈ రాశికి పంచమ, దశమాధిపతిగా అత్యంత శుభుడైన శుక్రుడు సప్తమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. పదోన్నతులు కలగడంతో పాటు, జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు ధన వర్షం కురిపిస్తాయి. రావల సిన సొమ్ము చేతికి అందుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పిల్లలు ఘన విజయాలు సాధి స్తారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి కుదరడం వంటివి జరుగుతాయి.