
ప్రతి సంవత్సరం నవరాత్రి తొమ్మిది రోజులలో భక్తులు దుర్గాదేవి తొమ్మిది విభిన్న రూపాలను పూజిస్తారు. హిందూ విశ్వాసం ప్రకారం ప్రతి రోజు దాని సొంత ప్రత్యేక రంగును కలిగి ఉంటుంది. ఇది దేవత లక్షణాలను , ఆశీర్వాదాలను ప్రతిబింబిస్తుంది. ఈ శుభ రంగుల ప్రకారం దుస్తులు ధరించడం ద్వారా.. భక్తులు సానుకూల శక్తిని, అమ్మవారి ఆశీర్వాదాలను పొందుతారు. 2025 నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ రోజు తొమ్మిది రోజుల రంగులు, వాటి ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం..

నవ రాత్రి మొదటి రోజు తెలుపు: నవరాత్రి మొదటి రోజు రంగు తెలుపు, ఇది శాంతి, స్వచ్ఛత, సరళతకు ప్రతీక. ఈ రంగు మనస్సును ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉంచుకోవాలనే సందేశాన్ని ఇస్తుంది.

నవ రాత్రి 2వ రోజు ఎరుపు: రెండవ రోజు రంగు ఎరుపు రంగు. ఇది శక్తి, ఆధ్యాత్మికతని, ఉత్సాహాన్ని సూచిస్తుంది. ఈ రంగు దుర్గాదేవి శక్తి, ఉత్సాహాన్ని సూచిస్తుంది.

నవ రాత్రి 3వ రోజు: రాయల్ బ్లూ: మూడవ రోజు రంగు రాయల్ బ్లూ. ఇది శాంతి, గంభీరత, శ్రేయస్సును సూచిస్తుంది. ఈ రంగు జీవితంలో స్థిరత్వం, అద్భుతమైన శక్తి, ప్రశాంతత, అంతర్గత శాంతికి ప్రతీక.

నవ రాత్రి 4వ రోజు: పసుపు: నాల్గవ రోజు పసుపు రంగు ధరిస్తారు. ఇది ఆనందం, సంతోషం, ఆశను సూచిస్తుంది. ఈ రంగు జీవితంలో సానుకూలతను, కొత్త ఆశలను తెస్తుంది.

నవ రాత్రి 5వ రోజు ఆకుపచ్చ: ఐదవ రోజు రంగు ఆకుపచ్చ. ఇది ప్రకృతి, శ్రేయస్సు, సమతుల్యతను సూచిస్తుంది. ఇది జీవితంలో తాజాదనాన్ని, సానుకూల మార్పులను తీసుకురావడాన్ని సూచిస్తుంది.

నవ రాత్రి 6వ రోజు బూడిద రంగు: ఆరవ రోజు రంగు బూడిద రంగులో ఉంటుంది. దీనిని సరళత, సమతుల్యతకు చిహ్నంగా పరిగణిస్తారు. జీవితంలోని ప్రతి పరిస్థితిని అంగీకరించాలని ఈ రంగు చూపిస్తుంది.

నవ రాత్రి 7వ రోజు నారింజ: ఏడవ రోజు నారింజ రంగులో ఉంటుంది. ఇది ఉత్సాహం, అభిరుచి, సానుకూల శక్తిని సూచిస్తుంది. ఈ రంగు జీవితాన్ని ఉత్సాహంతో నింపుతుంది. సృజనాత్మకత , జ్ఞానాన్ని సూచిస్తుంది.

నవ రాత్రి 8వ రోజు నెమలి ఆకుపచ్చ: ఎనిమిదవ రోజు పీకాక్ గ్రీన్ రంగును ధరిస్తారు. ఇది నీలం , ఆకుపచ్చ రంగుల అందమైన మిశ్రమం. ఇది జీవితంలో తాజాదనం, ఆనందం, సానుకూలతను సూచిస్తుంది.

నవ రాత్రి 9వ రోజు గులాబీ: నవరాత్రి చివరి రోజు శుభప్రదమైన రంగు గులాబీ రంగుకి చిహ్నం. ఇది ప్రేమ, దయ, కరుణను సూచిస్తుంది. ఈ రంగు సంబంధాలలో ప్రేమ, సామరస్యాన్ని కొనసాగించాలనే సందేశాన్ని ఇస్తుంది.