
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు చాలా ప్రత్యేక, ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాల సంచారం లేదా కలయిక, కొన్ని సార్లు ఇవి దగ్గరగా రావడం వలన యోగాలు ఏర్పడుతాయి. అయితే 2026 జనవరిలో మకర సంక్రాంతి రోజు లాభ దృష్టి రాజయోగం ఏర్పడ నుంది. ప్రస్తుతం శని గ్రహం మీన రాశిలో సంచరిస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్ర గ్రహం జనవరి 13న మకర రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ క్రమంలోనే జనవరి 15న మకర సంక్రాంతి రోజు శని గ్రహం, శుక్ర గ్రహం, 90 డిగ్రీల కోణంలో దగ్గరగా ఉంటాయి. దీని వలన లాభ దృష్టి యోగం ఏర్పడ నుంది. ఇది మూడు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది.

వృషభ రాశి : వృషభ రాశి వారికి సంక్రాంతి తర్వాత నుంచి మంచి కాలం ప్రారంభం కాబోతుంది. వీరికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా లాభ దృష్టి యోగం వలన ఏ పని చేసినా అందులో విజయం వీరి సొంతం అవుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోయి చాలా ఆనందంగా గడుపుతారు.

మిథున రాశి : మిథున రాశి వారికి ఊహించని ధన లాభ కలుగుతుంది. వీరు విదేశీ ప్రయాణాలు చేసే ఛాన్స్ ఉంది. అలాగే ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. విద్యార్థులకు లాభదృష్టి యోగం అదృష్టం తీసుకొస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగస్థులు ప్రమోషన్స్ పొందే ఛాన్స్ ఉంది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి జనవరి 15 తర్వాత నుంచి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. వీరు గత సంవత్సరంలో పడిన కష్టాల నుంచి విముక్తి పొందుతారు. కటుంబంలో శాంతియుత వాతావరణం నెలకుంటుంది. ఆర్థిక సమస్యలు తొలిగిపోయి, చాలా ఆనందంగా జీవిస్తారు. మునపటి కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. ఇది మీకు మీ కుటుంబానికి ఆనందాన్ని కలుగజేస్తుంది.

ఇక శని, శుక్ర గ్రహాల వలన ఏర్పడే లాభ దృష్టి యోగం వలన కుంభ రాశి వారి ఉద్యోగులకు, వ్యాపారస్తులకు చాలా అద్భుతంగా ఉండనున్నది. ఎవరు అయితే ప్రమోషన్, ఇంక్రీ మెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారో, వారికి ఇది మంచి సమయం. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు.