
వృషభం: మొండి పట్టుదలతో వ్యవహరించడం, అనుకున్నది సాధించడం కోసం అహర్నిశలూ శ్రమపడడం వంటి లక్షణాలు కలిగిన ఈ రాశివారికి సంక్రాంతి నుంచి ధన సంపాదనకు, కుటుంబం వృద్ధి చెందడానికి, కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఒక పద్ధతి ప్రకారం మదుపులు, షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెంచడం, తమకు రావలసిన డబ్బును రాబట్టుకోవడం జరుగుతుంది. వీరు త్వరలో సంపన్నుల కోవలో చేరే అవకాశం ఉంది.

కర్కాటకం: దూరదృష్టితో కలిగి ఉండడం, ఆచితూచి వ్యవహరించడంతో పాటు భవిష్యత్తు మీద ఎప్పుడూ దృష్టి పెట్టి ఉండే ఈ రాశివారు అనేక విధాలుగా ఆదాయాన్ని వృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ఖర్చులు తగ్గించుకుని షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల ద్వారా లాభాలు పొందడం వల్ల వీరి ఆదాయం వృద్ది చెందుతుంది. గట్టి పట్టుదలగా వ్యవహరించే ఈ రాశివారు ఆస్తిపాస్తులు కూడ గట్టుకోవడంలో, ఆస్తి వివాదాల్ని పరిష్కరించుకోవడంలో బాగా చొరవ చూపించడం జరుగుతుంది.

తుల: వ్యాపార ధోరణికి, వ్యూహాలు రూపొందించడానికి మారుపేరైన ఈ రాశివారు ఆదాయ వృద్దికి ప్రతి అవకాశాన్నీ, ప్రతి ప్రయత్నాన్నీ పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. వీరి కృషి ఫలితంగా సంక్రాంతి నుంచి వీరి ఆదాయం క్రమంగా పెరుగుతుంది. ధనార్జనతో పాటు, ఆస్తి పాస్తులు సమకూర్చుకోవడం, గృహ, వాహనాలను ఏర్పరచుకోవడం మీద కూడా దృష్టి సారిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సరికొత్త మార్పులు చేపట్టి ఆదాయాన్ని వృద్ది చేసుకుంటారు.

ధనుస్సు: ఏ విషయంలోనైనా, ఏ రంగంలోనైనా అగ్రస్థానంలో ఉండాలన్న వీరి లక్ష్యానికి తగ్గట్టుగా సంక్రాంతి నుంచి వీరికి నాలుగు గ్రహాలు అనుకూలంగా మారుతున్నాయి. అదనపు ఆదాయ మార్గాలు చేపట్టడం, ఖర్చులు తగ్గించుకోవడం, షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాల ద్వారా ఈ రాశివారు తమ ఆర్థిక పరిస్థితిని బాగా మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. రావలసిన సొమ్మును, బాకీలను, బకాయిలను గట్టి పట్టుదలతో రాబట్టుకుని ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తారు.

మకరం: లక్ష్యసాధనకు, పట్టుదలకు ప్రతిరూపమైన ఈ రాశివారు తప్పకుండా ఆదాయాన్ని పెంచుకుని ధనవంతుల కోవలో చేరిపోవడం జరుగుతుంది. సంక్రాంతి నుంచి వీరికి ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువగా ఉంటుంది. అదనపు ఆదాయాన్ని జాగ్రత్తగా మదుపు చేయడం, పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే అవకాశం ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా అంచనాలకు మించి లాభం పొందే అవకాశం ఉంది.

మీనం: మనసులోని కోరికలను తీర్చుకోవడానికి బాగా కష్టపడడానికి కూడా సిద్ధపడే ఈ రాశివారు ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడం మీద సంక్రాంతి తరువాత నుంచి దృష్టి పెట్టే అవకాశం ఉంది. లాభ స్థానంలో నాలుగు గ్రహాలు యుతి చెందడం వల్ల వీరికి ధన కాంక్ష బాగా పెరిగే అవకాశం ఉంది. తమకు రావలసిన డబ్బు, బాకీలు, బకాయిలను వసూలు చేసుకోవడంతో పాటు, అదన పు ఆదాయాన్ని మదుపు చేసి సంపన్నులు కావాలన్న తమ ధ్యేయాన్ని నెరవేర్చుకుంటారు.