
రాజస్థాన్‌లోని చురు జిల్లాలోని సాలాసర్ పట్టణంలో గడ్డం, మీసాలతో ఉన్న బజరంగబలి ఆలయం ఉంది. హనుమంతుడు విగ్రహం గడ్డం, మీసాలతో ఉన్న భారతదేశంలోని ఏకైక ఆలయం ఇదేనని నమ్ముతారు. ఇది చాలా ప్రత్యేకమైనది. సలాసర్ బాలాజీ ఆలయంలోని హనుమంతుని విగ్రహం గడ్డం, మీసాలతో ఉంటుంది. దీనిని సలాసర్ బాలాజీ అని కూడా పిలుస్తారు. బజరంగబలి ఈ ప్రత్యేక రూపంలో భక్తులతో పూజలను అందుకుంటున్న ఏకైక ఆలయం ఇదే.

ఈ హనుమాన విగ్రహం స్వయం భూ విగ్రహం అని నమ్ముతారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. సంవత్ 1811 (1754) లో నాగౌర్ జిల్లాలోని అసోటా గ్రామంలో ఒక రైతు పొలం దున్నుతున్నప్పుడు ఈ విగ్రహం బయల్పడింది. రైతు విగ్రహాన్ని కనుగొన్న తర్వాత.. ఆ గ్రామానికి చెందిన ఠాకూర్ కలలో హనుమతుడు కనిపించి "నేను నా భక్తుడైన మోహన్‌దాస్ కోసం కనిపించాను .. కనుక నన్ను వెంటనే సలాసర్‌కు తీసుకెళ్లండి" అని చెప్పాడు.

సలాసర్‌లో సాధువు మోహన్‌దాస్ మహారాజ్ కూడా తన కలలో గడ్డం, మీసాలతో ఉన్న హనుమంతుడిని చూశాడు. బాలాజీ ఈ రూపంలో కనిపిస్తాడని ఆయన చెప్పాడు. ఠాకూర్ విగ్రహాన్ని ఎద్దుల బండిపై సలాసర్‌కు తరలించారు. ఎద్దుల బండి ఎక్కడ ఆగిందో అక్కడ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ ప్రదేశం నేటి సలాసర్ బాలాజీ ధామ్.

ఈ ఆలయ సముదాయంలో మోహన్‌దాస్ సమాధి, 300 సంవత్సరాలకు పైగా నిరంతరం మండుతున్న అఖండ ధుని కూడా ఉన్నాయి. సలాసర్ బాలాజీని సందర్శించి కొబ్బరికాయను సమర్పించిన భక్తుడు కోరిన ప్రతి కోరిక నెరవేరుతుందని భక్తుల బలమైన నమ్మకం.

భక్తులు తమ ప్రార్థనలు నెరవేరడానికి ఆలయంలో కొబ్బరికాయలు కడతారు. సలాసర్ బాలాజీ ధామ్ రాజస్థాన్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా, విదేశాలలో కూడా హనుమంతుడి భక్తులకు ఒక పెద్ద విశ్వాస కేంద్రంగా పరిగణించబడుతుంది.

ఇక్కడ హనుమతుందడి విగ్రహం కళ్ళు, మీసం, గడ్డం మానవుడిలా ఉంటాయి. సలాసర్ బాలాజీ ఆలయంలో భక్తులు హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి హనుమతుంని ఆశీర్వాదాలను పొందడానికి చుర్మ లడ్డూను సమర్పిస్తారు.