Rakhi Festival 2023: సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు ఏ దిశలో కూర్చోవాలి? ఏ మంత్రాన్ని జపించాలి.. తెలుసా

| Edited By: TV9 Telugu

Aug 28, 2023 | 5:27 PM

సోదర సోదరమణులు ఎంతో ఇష్టంగా ఎదురుచూసే పండగ రాఖీ పండగ.. ప్రతి ఏడాది శ్రావణ మాసం పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. రక్షాబంధన్ పండుగ నాడు, సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుపై రాఖీని కట్టి.. తన సోదరుడు సుఖ సంతోషాలతో దీర్ఘాయువుతో జీవించాలంటూ ప్రార్థిస్తారు. భవిష్య పురాణం నుంచి  మహాభారతంతో సహా మొఘల్ కాలం నాటి చరిత్రతో సహా రక్షా బంధన్ ప్రస్తావన కనిపిస్తుంది. అయితే సనాతన ధర్మంలో రాఖీని కట్టే సమయంలో ఏ దిక్కున కూర్చోవాలి.. ఏ మంత్రం పాటించాలి పేర్కొన్నారు. 

1 / 5
రక్షా బంధన్ గురించి పురాణాల్లో కూడా చాలా చోట్ల ప్రస్తావించబడింది. అదే సమయంలో  సనాతన ధర్మంలో, మంత్రాలు జపించకుండా లేదా పఠించకుండా ఏ పవిత్ర పండుగను విజయవంతంగా పరిగణించరు. ఈ నేపథ్యంలో రాఖీ కట్టేటప్పుడు ఏ దిక్కున కూర్చోవాలి? ఏ మంత్రం పఠించాలి తెలుసుకుందాం.. 

2 / 5
సోదరి తన సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు , సోదరుడు నేలపై తూర్పు ముఖంగా కూర్చోవాలి. సోదరి తన సోదరుడి నుదుటిపై పడమర ముఖంగా కుంకుమ, చందనంతో తిలక ధారణ చేయాలి. అక్షతలను వేసి అనంతరం రక్షాసూత్రాన్ని తీసుకుని సోదరుడి కుడి చేతికి రాఖీ కట్టాలి. అనంతరం హారతినివ్వాలి. 

3 / 5
Rakhi Festival 2023: సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు ఏ దిశలో కూర్చోవాలి? ఏ మంత్రాన్ని జపించాలి.. తెలుసా

4 / 5
రాఖీ పర్వదినం రోజున సోదరుడి చేతికి శాస్త్రోక్తంగా రాఖీ కట్టేటప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తే కోరిన ఫలం లభిస్తుంది. అంతేకాదు మీ సోదరుడిపై దుష్ట శక్తుల ప్రభావం పడదు. అనుకున్న పనుల్లో విజయం దక్కుతుంది.

5 / 5
ఈ సంవత్సరం శ్రావణ పూర్ణిమ ఆగస్టు 30 లేదా 31 రెండు రోజులు వచ్చింది. పూర్ణిమ తిథి ఆగస్టు 30 ఉదయం 10.58 గంటలకు ప్రారంభమై.. మర్నాడు ఉదయం 7.05 గంటలకు ముగుస్తుంది. అయితే భద్ర నీడ ఉండడంతో అప్పుడు రాఖీ కట్టకూడదు. సోదరుడికి  రాఖీ కట్టడానికి శుభ సమయం 30వ తేదీ రాత్రి 9.01 నుంచి మర్నాడు 31వ తేదీ 7.05 వరకు కట్టాల్సి ఉంది.