మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఈ నెలలో శుభ గ్రహాలన్నీ అనుకూలంగా మారుతున్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావడం, ఏ ప్రయత్నం తలపెట్టినా ఆటంకాలు లేకుండా విజయవంతం కావడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఆదాయ పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కుజ, శుక్ర, బుధ గ్రహాల అనుకూలత పెరగడం వల్ల అన్ని రంగాలవారికి ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యం కూడా సవ్యంగా సాగిపోతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి కొద్ది ప్రయత్నంతో విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఆర్థిక విషయాలను ఇతరులతో పంచు కోకపోవడం శ్రేయస్కరం. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోతారు. విదేశీ యానానికి అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభ వార్తలు వినే సూచనలున్నాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయడంలో బాగా ముందుం టారు.