
న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ, సమయం, నెల ఆధారంగా ఆ వ్యక్తి జీవితం, కెరీర్, గుణ గణాలు తెలపవచ్చు అంటారు సంఖ్యా శాస్త్ర నిపుణులు. అదే విధంగా వ్యక్తి ప్రేమ జీవితం గురించి కూడా వివరంగా తెలుసుకోవచ్చునంట. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం.

అయితే ఇప్పుడు మనం 14 వ తేదీ, 5 వతేదీ, 23వ తేదీన జన్మించిన వారి ప్రేమ, వైవాహిక జీవితం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ సంఖ్యల మూల సంఖ్య 5. అయితే ఈ మూల సంఖ్యలో జన్మించిన వారికి అన్నివిషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రేమ విషయంలో మాత్రం సమస్యలు ఎదురు అవుతాయంట.

14వతేదీన జన్మించిన వారికి చాలా అదృష్టం ఉంటుందంట. కానీ వీరికి లవ్ మాత్రం కలిసి రాదు అని చెబుతున్నారు సంఖ్యా శాస్త్ర నిపుణులు. వీరు ఎప్పుడూ ప్రేమలో ఫెయిల్ అవుతూనే ఉంటారంట.

5వ తేదీన జన్మించిన వారికి కెరీర్ పరంగా మంచి వృద్ధి ఉంటుందంట కానీ వైవాహిక జీవితం, ప్రేమ పెళ్లి వంటివి కలిసి రావంట. వీరు ప్రేమ పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు తప్పవంటున్నారు పండితులు.

23వ తేదీలో జన్మించిన వారికి వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుందంట. కానీ వీరు లవ్‌లో మాత్రం మోసపోవడం తప్పదు అని చెబుతున్నారు సంఖ్యా శాస్త్ర నిపుణులు.