9 / 9
రాత్రి జరిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణానికి అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి స్థానిక శాసనసభ్యులు దేవ వరప్రసాదరావు సహా భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ రోజు వేకువ జాము నుంచి స్వామివారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు క్యూ కట్టారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే ఆలయ అధికారులు, పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.