Mysterious Temple: నేటికీ శాస్త్రజ్ఞులకు సవాల్ ఈ ఆలయం.. నీటితో వెలిగే దీపాలు .. ఎక్కడంటే..

Updated on: Jul 23, 2025 | 10:57 AM

భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. మనదేశంలో అద్భుతాలకు కొరత లేదు. అయితే విశ్వాసం, అద్భుతమైన సంఘటనలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఆధునిక కాలంలో కూడా కొన్ని రహస్యాలను నేటికీ సైన్స్ కూడా చేధించలేక పోయింది. అలాంటి రహస్యాన్ని దాచుకుని సైన్స్ కి నేటికీ సవాల్ విసురుతున్న ఆలయాల్లో ఒకటి మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో ఉంది. ఈ ఆలయంలో దీపాలను నూనె లేదా నెయ్యితో వెలిగించరు. కేవలం నీటితో దీపాలు దేదీప్యమానంగా వెలుగుతూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

1 / 7
భారతదేశం అద్భుతాలు, రహస్యాలకు నెలవు. ఇక్కడ విశ్వాసం, విజ్ఞాన శాస్త్రం మధ్య రేఖ కొన్నిసార్లు అస్పష్టంగా ఉంటుంది. అటువంటి నమ్మశక్యం కాని, రహస్యమైన ఆలయం మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో ఉంది. ఈ ఆలయంలోని దీపాలను నూనె లేదా నెయ్యితో కాదు.. నీటితో వెలిగిస్తారు. నీటితో దీపాలు దేదీప్యమానంగా వేలడం అన్న మాటని ఊహించలేము అనిపించవచ్చు. కానీ ఇది నిజం. పైగా ఇలా నీరుతో దీపం వెలిగించడం అనేది ఈ ఆలయంలో వందల సంవత్సరాలుగా జరుగుతున్న నమ్మలేని నిజమా. దీనిని చూసి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు.

2 / 7
ఈ రహస్య ఆలయం ఏమిటి?
ఈ అద్భుతమైన ఆలయాన్ని గడియాఘాట్ వలీ మాతాజీ  అని పిలుస్తారు, ఇది షాజాపూర్ జిల్లా ప్రధాన ఆఫీసు నుంచి 15 కి.మీ దూరంలో నల్ఖేడా సమీపంలో ఉంది. కాళీసింధ్ నది ఒడ్డున నిర్మించిన ఈ ఆలయంలో, ప్రతి సాయంత్రం నీటిని ఉపయోగించి దీపాలను వెలిగిస్తారు. ఉదయం ఈ దీపాలు స్వయంచాలకంగా ఆరిపోతాయి. మర్నాడు సాయంత్రం ఆ దీపాలను నీటితో మళ్ళీ వెలిగిస్తారు.

ఈ రహస్య ఆలయం ఏమిటి? ఈ అద్భుతమైన ఆలయాన్ని గడియాఘాట్ వలీ మాతాజీ అని పిలుస్తారు, ఇది షాజాపూర్ జిల్లా ప్రధాన ఆఫీసు నుంచి 15 కి.మీ దూరంలో నల్ఖేడా సమీపంలో ఉంది. కాళీసింధ్ నది ఒడ్డున నిర్మించిన ఈ ఆలయంలో, ప్రతి సాయంత్రం నీటిని ఉపయోగించి దీపాలను వెలిగిస్తారు. ఉదయం ఈ దీపాలు స్వయంచాలకంగా ఆరిపోతాయి. మర్నాడు సాయంత్రం ఆ దీపాలను నీటితో మళ్ళీ వెలిగిస్తారు.

3 / 7
నీటితో దీపాలు ఎలా వెలుగుతాయి?
ఆలయ పూజారి ఇది మాయాజాలం కాదని మాతాజీ చేసిన అద్భుతం అని చెబుతున్నారు. పూజారి చెప్పిన ప్రకారం, ఆలయంలో దీపం వెలిగించేందుకు కలిసింధ్ నది నుంచి వచ్చే ఒక ప్రత్యేక రకమైన నీటిని ఉపయోగిస్తారని తెలుస్తుంది. ఈ నీటిని దీపంలో పోసినప్పుడు.. కొంత సమయం తర్వాత అది జిగట పదార్థంగా మారుతుంది. తరువాత దీపం వెలగడం మొదలవుతుంది. ఈ అద్భుతం మాతాజీ ఆస్థానంలో మాత్రమే జరుగుతుందని .. ఇదే నీరుని ఉపయోగించి మరే ఇతర ప్రదేశంలో దీపాలను వెలిగించలేమని పూజారి చెబుతాడు.

నీటితో దీపాలు ఎలా వెలుగుతాయి? ఆలయ పూజారి ఇది మాయాజాలం కాదని మాతాజీ చేసిన అద్భుతం అని చెబుతున్నారు. పూజారి చెప్పిన ప్రకారం, ఆలయంలో దీపం వెలిగించేందుకు కలిసింధ్ నది నుంచి వచ్చే ఒక ప్రత్యేక రకమైన నీటిని ఉపయోగిస్తారని తెలుస్తుంది. ఈ నీటిని దీపంలో పోసినప్పుడు.. కొంత సమయం తర్వాత అది జిగట పదార్థంగా మారుతుంది. తరువాత దీపం వెలగడం మొదలవుతుంది. ఈ అద్భుతం మాతాజీ ఆస్థానంలో మాత్రమే జరుగుతుందని .. ఇదే నీరుని ఉపయోగించి మరే ఇతర ప్రదేశంలో దీపాలను వెలిగించలేమని పూజారి చెబుతాడు.

4 / 7
అసలు నూనెతో కాకుండా కేవలం నీటితో ఆలయంలో ఎలా దీపాలు వెలుగుతున్నాయి అనే విషయన్ని తెలుసుకునేందుకు ఈ ఘటనకు సంబంధించిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు చాలాసార్లు ఆలయాన్ని సందర్శించారు. రకరకాల పరిశోధనలు చేశారు. అయితే కానీ ఎవరూ ఈ రహస్యాన్ని ఛేదించలేకపోయారు. నీటిని కూడా పరీక్షించారు. అయితే ఈ నీటిలో దీపాలను వెలిగించే రసాయన మూలకాలు ఏమీ ఆ నీటిలో ఉన్నట్లు కనుగొనబడలేదు. అందుకే ఆలయంలోని దీపాలు నీటితో ఎలా వెలుగుతున్నాయనేది తెలుసుకోవడం నేటికీ శాస్త్రానికి సవాల్ అని చెప్పవచ్చు.

5 / 7
ఈ అద్భుతం శతాబ్దాలుగా జరుగుతోందా?
ఈ అద్భుతం శతాబ్దాలుగా జరుగుతోందని..మాతాజీ దయవల్లే ఇది సాధ్యమవుతుందని పూజారులు అంటున్నారు. వారు చెప్పిన ప్రకారం నదిలో నీరు ఉన్నంత వరకు, దివ్వెలు మండుతూనే ఉంటాయి. నది ఎండిపోయిన వెంటనే ఈ అద్భుతం కూడా ఆగిపోతుంది. అయితే ఇది చాలా అరుదు, ఎందుకంటే కాళీసింధ్ నది సాధారణంగా ఏడాది పొడవునా ప్రవహిస్తుంది.

ఈ అద్భుతం శతాబ్దాలుగా జరుగుతోందా? ఈ అద్భుతం శతాబ్దాలుగా జరుగుతోందని..మాతాజీ దయవల్లే ఇది సాధ్యమవుతుందని పూజారులు అంటున్నారు. వారు చెప్పిన ప్రకారం నదిలో నీరు ఉన్నంత వరకు, దివ్వెలు మండుతూనే ఉంటాయి. నది ఎండిపోయిన వెంటనే ఈ అద్భుతం కూడా ఆగిపోతుంది. అయితే ఇది చాలా అరుదు, ఎందుకంటే కాళీసింధ్ నది సాధారణంగా ఏడాది పొడవునా ప్రవహిస్తుంది.

6 / 7
విశ్వాసం, విజ్ఞాన శాస్త్రం మధ్య వారధి
గడియాఘాట్ మాతాజీ ఆలయం విశ్వాసం, సైన్స్ కి మధ్య వారధిగా నిలిచే ప్రదేశం. శాస్త్రీయ తర్కం , విశ్లేషణ ఈ రహస్యాన్ని పరిష్కరించడంలో విఫలమైనప్పటికీ, లక్షలాది మంది భక్తుల అచంచల విశ్వాసం ఈ అద్భుతాన్ని అంగీకరిస్తుంది. ఈ ఆలయం భారతదేశ గొప్ప ఆధ్యాత్మిక వారసత్వానికి ఒక ఉదాహరణ, ఇక్కడ అతీంద్రియ సంఘటనలు ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి.

విశ్వాసం, విజ్ఞాన శాస్త్రం మధ్య వారధి గడియాఘాట్ మాతాజీ ఆలయం విశ్వాసం, సైన్స్ కి మధ్య వారధిగా నిలిచే ప్రదేశం. శాస్త్రీయ తర్కం , విశ్లేషణ ఈ రహస్యాన్ని పరిష్కరించడంలో విఫలమైనప్పటికీ, లక్షలాది మంది భక్తుల అచంచల విశ్వాసం ఈ అద్భుతాన్ని అంగీకరిస్తుంది. ఈ ఆలయం భారతదేశ గొప్ప ఆధ్యాత్మిక వారసత్వానికి ఒక ఉదాహరణ, ఇక్కడ అతీంద్రియ సంఘటనలు ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి.

7 / 7

వర్షాకాలంలో ఈ ఆలయంలో దీపం వెలగదు. ఎందుకంటే వర్షాకాలంలో కలిసింద నది నీటి మట్టం పెరగడం వల్ల ఈ ఆలయం నీటిలో మునిగిపోతుంది. ఈ సమయంలో పూజలు చేయడం సాధ్యం కాదు. మళ్ళీ ఆలయం నీటి నుంచి బయటకు వచ్చిన తర్వాత పూజలు మొదలవుతాయి  అప్పుడే ఆలయంలో మళ్లీ అఖండ జ్యోతి వెలిగిస్తారు. ఇది వచ్చే ఏడాది వర్షాకాలం వరకు ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది.