
శాస్త్రీయ కోణంలోనే కాదు.. ఆరోగ్యపరంగా మునగ చెట్టు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. దీని విస్తృతమైన ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మునగ చెట్టును పెంచుకోవచ్చు. అయితే ఇంటికి దగ్గరలో మునగ చెట్టుని పెంచుకోవడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతుంది.

నివాస భవనాల దగ్గర మునగకాయ వంటి పెద్ద చెట్లను నాటకూడదని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. పొలాలు లేదా సామూహిక ప్రాంతాల్లో మునగ చెట్టుని పెంచుకోవడం మంచిదని పేర్కొంది. ఈ మొక్కని పెంచడం చాలా సులభం. అయినప్పటికీ మునగ చెట్టు ఏపుగా పెరగడానికి సూర్యకాంతి, మంచి నీటి పారుదల, కత్తిరించడం వంటివి చేయాల్సి.

ఈ చెట్టు చాలా సులభంగా పెరుగుతుంది. కరువుని తట్టుకుని తక్కువ నీటితోనే పెరిగే ఈ మొక్క పర్యావరణానికి మేలు చేస్తుంది. అంతేకాదు మునగ కాయలు, ఆకులు, పొడిలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

వాస్తు శాస్త్రం నివాస స్థలాలలో లేదా ఇంటి పునాదులకు సమీపంలో మునగకాయ వంటి పెద్ద చెట్లను నాటకుండా ఉండాలని సిఫార్సు చేస్తుంది. ఎందుకంటే మునగ చెట్టు వేర్లు పొడవుగా పెరుగుతాయి. దీంతో ఇంటి ట్టి గోడలు, ఫౌండేషన్‌లకు హాని కలిగించే అవకాశం ఉంటుంది.

మరోవైపు వాస్తు కోణంలో మునగ చెట్టును ఇంటి పునాదులకు దూరంగా దక్షిణ దిశలో లేదా పశ్చిమ భాగంలో నాటడం శ్రేయస్కరమని తెలుస్తోంది. ఈ దిశల్లో మునగ మొక్కను నాటడం కుటుంబంలో ఆరోగ్యం, శ్రేయస్సు, సంపదకు సంకేతంగా భావిస్తారు. దక్షిణ , పశ్చిమ దిశలో ఉండే మునగాకు చెట్టు ఇంట్లోని ప్రతికూల శక్తులను తగ్గించి.. సానుకూల శక్తులను పెంచుతుందని నమ్మకం ఉంది.

వాస్తు ప్రకారం మునగ చెట్టును ఉత్తరం లేదా ఈశాన్యం దిశలో నాటకూడదు. .. ఒకవేళ ఈ దిశల్లో మునగ చెట్టు ఉంటె.. ఆ ఇంట్లో కష్టాలు ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉంటాయని.. శుభఫలితాలను తగ్గిస్తుందని నమ్మకం.

అంతేకాదు ఇంటి ఆవరణలో ప్రధాన ద్వారం పక్కనే మునగ చెట్టు పెంచుకోవడం మంచిది కాదు. అందుకనే ఎన్నో ప్రయోజనాలు ఇచ్చే ఈ మొక్కను సరైన ప్రదేశంలో, సరైన దిశలో ఇంటికి నిర్ణీత దూరంలో పెంచుకోవడం వలన ప్రయోజనాలు పొందవచ్చు.

మునగ చెట్టులోని ప్రతి భాగం తినదగినది. అందుకనే దీనిని "అద్భుత వృక్షం" అని అంటారు. మునగ ఆకులు, కాయలు, పువ్వులు అన్నిటిలో విటమిన్లు A, E, C, కాల్షియం, ఇనుము, పొటాషియం పుష్కలంగా కలిగి ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వలన ఇది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, కాలేయ పనితీరుకు మద్దతు ఇవ్వడానికి, కడుపు సమస్యలతో పోరాడటానికి సహాయపడుతుంది.