Money
లక్ష్మీదేవి చంచల స్వభావి. తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించే వ్యక్తి లేదా సంపాదించిన డబ్బును తప్పుడు స్థలంలో ఖర్చు చేసే వ్యక్తికి లక్ష్మీ కటాక్షం ఎన్నటికీ లభించదు. అందుకే తప్పుడు మార్గాల ద్వారా లేదా అబద్ధాలతో డబ్బు సంపాదించకూడదు. ఈ రకమైన సంపాదన వ్యక్తిని లాభాపేక్షకు బదులు ఆర్థికంగా బలహీనపరుస్తుంది.
అదృష్టం మీద ఆధారపడకుండా కష్టపడి పనిచేసే వ్యక్తికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. అలాంటి వారి జీవితంలో డబ్బుకు లోటు అనేది కలగదు. అంతే కాకుండా జీవితంలో సుఖ సంపదలు లభిస్తాయి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కష్టపడి పనిచేసే వారు త్వరగా విజయం సాధిస్తారని చాణక్యుడు నమ్మాడు.
తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించిన తర్వాత మనిషిలో దురాశ పుడుతుంది. సంపాదించిన డబ్బు ఎప్పుడూ ఇతరుల కోసం ఖర్చు చేయకుండా ఉన్నా కూడా లక్ష్మీదేవి కోపానికి గురికావలసి ఉంటుంది. ఎందుకంటే సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని అయినా దాతృత్వం కోసం ఇవ్వాలని చాణక్య నీతి చెప్పింది. దీనివల్ల మీరు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతారని కూడా పేర్కొంది.
అబద్ధాలు చెప్పి సంపాదించిన ధనం ఏ వ్యక్తికీ ఫలించదు. అటువంటి సంపద పాపంతో సమానంగా పరిగణించబడుతుంది. ఇంకా అటువంటి సిరిసంపదలు వ్యక్తిని కూడా బాధపెడతాయి. అందుకే ఎంత కష్టపడి అబద్ధాలు చెప్పి సంపాదించినా ఆర్థికంగా పురోగతి ఉండదు.