
మేషం: ఈ రాశికి భాగ్య స్థానాధిపతి అయిన గురువు చతుర్థ స్థానంలో ఉచ్ఛపడుతున్నందు వల్ల కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారికి రుణ, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. అనేక విధాలుగా ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక అవసరాలు కూడా చాలావరకు తీరిపోతాయి. స్థిర, చరాస్తులు కూడా వృద్ధి చెందుతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందడం జరుగుతుంది.

మిథునం: ఈ రాశికి ధన స్థానంలో గురువు ఉచ్ఛపడుతున్నందువల్ల మే నుంచి ఈ రాశివారు ఆర్థికంగా ఎదగడం ప్రారంభం అవుతుంది. ఆదాయం పెరగడంతో వీరు క్రమంగా ఆర్థిక, రుణ సమస్యల నుంచి బయటపడడం మొదలవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్ము చేతికి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి ధన లాభం కలుగుతుంది.

కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారు ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఎంతో సమర్థవంతంగా వ్యవహరించడం ప్రారంభమవుతుంది. ఒక ప్రణాళిక ప్రకారం ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి, రుణ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. దీర్ఘ కాలిక రుణాల నుంచి కూడా విముక్తి పొందే అవకాశం ఉంది. ఆర్థికపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి మే నుంచి అపారంగా లాభిస్తాయి.

కన్య: ఈ రాశికి లాభ స్థానంలో ధన కారకుడు గురువు ఉచ్ఛపడుతున్నందువల్ల మే నెల నుంచి దాదాపు సంవత్సరం పాటు ఈ రాశివారి ఆదాయం దిన దినాభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఫలి తంగా ఎటువంటి రుణ సమస్య నుంచయినా విముక్తి లభిస్తుంది. రావలసిన సొమ్ము చేతికి అందడం, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభించడం, ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపా రాలు లాభాల పట్టడం వంటి కారణాల వల్ల ఆదాయానికి లోటుండదు. పిత్రార్జితం కూడా లభిస్తుంది.

వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలో గురువు ఉచ్ఛపడుతున్నందువల్ల కొత్త సంవత్సరం ద్వితీయార్థం నుంచి ఈ రాశివారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించడం ప్రారంభం అవుతుంది. ఒకటికి రెండుసార్లు ధనయోగాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. తక్కువ శ్రమతో అంచనాలకు మించి లాభాలు కలుగుతాయి. విదేశీ సంపాదన యోగం కూడా పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఆదాయం వృద్ది చెందుతుంది.

మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉచ్ఛ గురువు సంచారం వల్ల మే నుంచి ఈ రాశివారికి ఆర్థికాభివృద్దే తప్ప ఆర్థిక సమస్యలు ఉండే అవకాశం లేదు. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. రుణ సమస్యల నుంచి పూర్తిగా బయటపడం జరుగుతుంది. ఖర్చులు బాగా తగ్గుతాయి. వైద్యఖర్చులు కూడా బాగా తగ్గడం జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది.