ఈ నెల (మార్చి) నాలుగు ప్రధాన గ్రహాలు రాశులు మారడం జరుగుతోంది. రవి, బుధ, శుక్ర, కుజులు మారడం వల్ల తప్పకుండా కొన్ని రాశుల వారి మీద ప్రభావం ఉంటుంది. ఈ నెల 8వ తేదీన బుధుడు మీన రాశిలోకి, శుక్రుడ కుంభ రాశిలోకి మారుతుండగా, ఈ నెల 16న రవి మీన రాశిలోకి, కుజుడు కుంభ రాశిలోకి మారడం జరుగుతుంది. మొత్తం మీద ఈ నెల 8వ తేదీ నుంచి ఏప్రిల్ 16 వరకు నాలుగు గ్రహాల రాశి మార్పు ప్రభావం ఏడు రాశుల మీద ఉండే అవకాశం ఉంది. మేషం, వృషభం, మిథునం, తుల, ధనుస్సు, మకరం, కుంభ రాశుల వారు ఈ గ్రహాల వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందబోతున్నారు.