
మేషం: ఈ రాశికి ఈ పరివర్తన వల్ల కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. బంధుమిత్రుల నుంచి రుణాలను రాబట్టుకుంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. బంధువుల్లో పెళ్లి నిశ్చయం అవుతుంది.

వృషభం: ఈ రాశివారికి ఈ పరివర్తన యోగం వల్ల అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాల వంటివి బాగా లాభిస్తాయి. ఆర్థిక ఒప్పందాలు కుదురుతాయి. విదేశీయానానికి, విదేశాల్లో ఉద్యోగాలకు ప్రయత్నాలు ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం. దూరపు బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదాలు రాజీమార్గంలో పరిష్కారమవుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.

మిథునం: ఈ పరివర్తన వల్ల ఈ రాశివారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది ప్రయత్నంతో లాభాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు వృద్ధి చెందడం జరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగాలకు ప్రయత్నించడం మంచిది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. మాటకు విలువ పెరుగుతుంది.

కన్య: ఈ రాశికి ఈ పరివర్తన యోగం తప్పకుండా రాజయోగాలను కలిగిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. షేర్లు, మదుపులు, పెట్టుబడులు బాగా లాభిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మీ సలహాలు, సూచనల వల్ల సంస్థకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. రావలసిన సొమ్ము, బాకీలను వసూలు చేసుకుంటారు.

తుల: ఈ రాశికి బుధ, చంద్రుల పరివర్తన వల్ల ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు, ఆర్థిక సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. దూరపు బంధు వుల్లో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబంలో సమస్యలన్నీ పరిష్కారమై, సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

మీనం: ఈ రాశికి ఈ పరివర్తన వల్ల అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు ప్రారంభించడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది.