
మేషం: ఈ రాశికి బుధుడు అష్టమ రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. దీనివల్ల ఈ రాశివారు ఎటు వంటి ప్రయత్నాలు చేసినా ఆటంకాలు, అవరోధాలు ఎక్కువగా ఉంటాయి. తరచూ అనారోగ్యా లతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. వీరి పని తీరుతో అధికారులు సంతృప్తి చెందరు. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు తగ్గుతాయి. ఆర్థిక సమ స్యలు పెరుగుతాయి. బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉండకపోవచ్చు.

మిథునం: రాశ్యధిపతి బుధుడు షష్ట స్థానంలో ప్రవేశించడం వల్ల ఆలోచనలు నిలకడగా ఉండవు. తరచూ నిర్ణయాలను మార్చుకోవడం వల్ల ఇబ్బంది పడతారు. ఏదో ఒక అనారోగ్యం పీడిస్తుంది. ఇష్టమైన బంధుమిత్రులు దూరమవుతారు. ఆదాయం తగ్గి, ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. రుణ బాధలు కలుగుతాయి. ఆర్థిక, గృహ సంబంధమైన ఒప్పందాలు సవ్యంగా అమలు జరగకపోవచ్చు. నష్ట దాయక వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో బాగామోసపోయే అవకాశం ఉంది.

కన్య: రాశ్యధిపతి బుధుడు తృతీయ స్థానంలో సంచారం చేయడం ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. వృథా ప్రయాణాలు చేయడం జరుగుతుంది. ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఏ ప్రయత్నమూ ఒక పట్టాన కలిసి రాదు. రావలసిన సొమ్ము చేతికి అందక ఇబ్బంది పడతారు. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

వృశ్చికం: బుధుడు ఈ రాశికి అత్యంత పాపి అయినందువల్ల ఈ రాశిలో బుధ సంచారం వల్ల పురోగతికి ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. సరైన నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉంటారు. ఆర్థిక లావాదే వీలు బాగా నష్టం కలిగిస్తాయి. డబ్బు ఇచ్చినా, తీసుకున్నా సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో మోసపోవడం లేదా నష్టపోవడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా తగ్గుముఖం పడతాయి. సహాయం పొందిన బంధుమిత్రులు ముఖం చాటేసే అవకాశం ఉంది.

ధనుస్సు: ఈ రాశికి వ్యయ స్థానంలో బుధుడి సంచారం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామితో తరచూ వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. మనశ్శాంతి లోపిస్తుంది. ఉద్యోగంలో అధికారులతో సమస్యలు ప్రారంభం అవుతాయి. అధికారుల నమ్మకాన్ని కోల్పోవడం జరుగుతుంది. బాధ్యతల నిర్వహణలో బాగా పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. ఇష్టంలేని ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలున్నాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎక్కువగా ఉంటాయి.