సంక్రాంతికి నువ్వుల నూనెతో స్నానం, నువ్వుల వంటలు ఎందుకో తెలుసా.. దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే

|

Jan 08, 2025 | 6:54 PM

సంక్రాంతి లేదా సంక్రమణ అంటే మారడం అని అర్ధం.. నవ గ్రహాల అధినేత సూర్యుడు ప్రతి నెలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు..దీనినే సంక్రాంతి అంటారు. ఇలా ఏడాదికి 12 సంక్రాంతులు వస్తాయి. కానీ పుష్య మాసంలో వచ్చే మకర సంక్రాంతికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ పండగ ప్రతి ఏడాది జనవరి నెలలో వస్తుంది. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు వచ్చే రోజుని మకర సంక్రాంతిగా జరుపుకుంటారు.

1 / 7
ఏడాది పాటు ఎదురుచూసే పండగ సంక్రాంతి పండగ అంటే ఇంటి ముంగిట ముగ్గులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, కొత్త అల్లుడు, కోడి పందాలు మాత్రమే కాదు నువ్వుల నూనేతో చేసే స్నానం, నువ్వులతో చేసే పిండి వంటలు కూడా..సంక్రాంతి రోజున చేసే పిండి వంటల్లో నువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాదు అభ్యంగ స్నానం చేసే సమయంలో నువ్వుల నూనె ను ముందుగా శరీరానికి రాసి నలుగు పెట్టి మరీ స్నానం చేయిస్తారు. అయితే మకర సంక్రాంతికి నువ్వులకు మధ్య పురాణాల ప్రకారం ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 7

సంక్రాంతి రోజున తెల్లవారు జామునే అభ్యంగ స్నానం చేసే ముందు నుదుటిన కుంకుమ పెట్టుకుని నువ్వుల నూనెను తీసుకుని గోరు వెచ్చగా చేసి ఆ నూనెను శరీరం అంతా మర్ధన చేసుకుంటారు. అనంతరం సున్నిపిండితో ఒళ్ళురుద్దుకుని కుంకుడు రసంతో తలకు స్నానం చేస్తారు. అనంతరం కొత్త బట్టలు ధరించి దేవుడికి పూజ చేస్తారు.

3 / 7
హిందూ పురాణాల ప్రకారం నువ్వులు యమ ధర్మరాజుకు ఇష్టమైనవిగా పరిగణిస్తారు. కొన్ని పురాణాల ప్రకారం విష్ణువు స్వేద బిందువులే నువ్వులుగా మారాయని.. ఇవి అమరత్వపు విత్తనాలకు సూచన అని చెప్పారు.

4 / 7
సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత వసంతకాలం మొదలవుతుంది. ఇక నుంచి పగలు ఎక్కువగా రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో నువ్వులు తినడం వల్ల శరీరం వాతావరణంలో చోటు చేసుకునే మార్పులకు రెడీ అవుతుంది.

5 / 7
మకర సంక్రాంతి పండగ రోజున స్నానం చేసే మందు నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దనా చేసుకోవడం వలన ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు నలుగు పిండితో శరీరం రుద్దుకోవడం వలన శరీరం శుభ్రపడుతుంది.

6 / 7
సంక్రాంతి రోజు నువ్వులు దానం చేయడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం. కనుక ఈ రోజున నువ్వులను బ్రహ్మణులకు లేదా పేదవారికి దానం చేయడం శుభాలను చేకూరుస్తుందని నమ్మకం.

7 / 7
ఈ పండగ నుంచి చలి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది. దీంతో శరీరంలో అనేకమైన మార్పు చోటు చేసుకుంటాయి. కనుక వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా ఆరోగ్యంగా ఉనేందుకు సంక్రాంతికి చేసే వంటల్లో నువ్వులు ఎక్కువగా ఉపయోగిస్తారు.