Mahashivratri 2024: మహా శివరాత్రికి లాంగ్ వీకెండ్.. లింగమయ్య దర్శనంతో గుడ్ ఫీల్ ఇచ్చే ఆధ్యాత్మిక ప్రదేశాల్లో పర్యటన బెస్ట్ ఎంపిక

|

Feb 23, 2024 | 9:16 AM

మహా శివరాత్రిన లాంగ్ వీకెండ్ రానుంది. దీంతో ఎవరైనా బెస్ట్ ప్లేస్ లో అది కూడా ఆధ్యాత్మిక పరిమళాలు ఉండే ప్రదేశాల్లో పర్యటించాలి అనుకుంటారు. కనుక ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. తక్కువ ఖర్చుతో సంతోషముగా లాంగ్ వీకెండ్ ను ఎంజాయ్ చేయవచ్చు. కనుక లాంగ్ వీకెండ్ లో మనదేశంలోనే ఆధ్యాత్మిక ఉట్టిపడే పర్యాటక ప్రదేశాలను సందర్శించండి. మహా శివరాత్రి పండుగ మార్చి 8న జరుపుకోనున్నారు. శివుడి జన్మదినంగా భావించే ఈ రోజున శివ పార్వతుల కళ్యాన్ని కూడా జరిపిస్తారు.  అయితే ఈ ఏడాది మహా శివ రాత్రి శుక్రవారం రోజున వచ్చింది. 

1 / 5
మహా శివరాత్రి రోజున శివుడిని ఆరాధించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. శివరాత్రి శుక్రవారం వచ్చింది. మర్నాడు శనివారం, ఆదివారం ఇలా వరసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. కనుక ఎవరైనా  ఆధ్యాత్మిక పర్యటన చేయాలనుకుంటే ఈ లాంగ్ వీకెండ్ ఒక ప్రత్యేక అవకాశం. మీరు సందర్శించడానికి ఎక్కడికి వెళ్లవచ్చో  ఈ రోజు తెలుసుకుందాం...  All Images Credit: Getty

2 / 5
హరిద్వార్-రిషికేశ్: ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో రిషికేశ్ పేరు చేర్చబడింది. కానీ ఈ ప్రదేశంలో అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి. వీటిల్లో ఒకటి పౌరీ గర్వాల్‌లో ఉన్న నీలకంఠ మహాదేవ్ ఆలయం. పురాణాల ప్రకారం మహాదేవుడు సముద్ర మథనం నుండి వచ్చిన విషాన్ని ఇక్కడే తాగాడు. ఈ కారణంగా శివుడి మెడ నీలం రంగులోకి మారింది. ఈ ఆలయాన్ని సందర్శిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెబుతారు

3 / 5
మహాకాళేశ్వర దేవాలయం: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని శివుని పూజించడానికి ప్రసిద్ధి చెందిన ప్రదేశం. దీనిని శివుడు కొలువైన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఈ ఒకటి . ఇక్కడ ఉన్న ఈ ఆలయం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. మహాశివరాత్రి సమయంలో ఇక్కడి వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో భాగస్వామ్యమయ్యేందుకు భక్తులు భారీసంఖ్యలో భక్తులు తరలి వస్తారు.

4 / 5
శ్రీ శైలం:  ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రం కూడా మంచి ఆధ్యాత్మిక పర్యటన క్షేత్రం. ఇక్కడ నల్లమల అడవులు, ఇష్టకామేశ్వరి ఆలయం, మహానంది వంటి అనేక ప్రదేశాలను మూడు రోజుల పాటు సందర్శించవచ్చు. All Images Credit: Getty

5 / 5
నాసిక్: మూడు రోజులు వరస సెల్లవుల్లో సింపుల్ గా అందంగా మీ ట్రిప్ సాగిపోవాలంటే మహారాష్ట్రలోని షిర్డీ, నాసిక్ యాత్ర బెస్ట్ ఆప్షన్. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన త్రయంబకేశ్వరుడిని దర్శించుకోవచ్చు. నాసిక్ లో గోదావరి జన్మ స్థలం, దశరథ్ ఘాట్,  పంచవటి వంటి రామాయణంలో సంబంధం ఉన్న అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు. అంతేకాదు వీలయితే భీమ శంకరం కూడా వెళ్ళవచ్చు.  All Images Credit: Getty