
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రాశివారికి చెందిన యువతీ యువకులు తప్పకుండా ప్రేమలో పడే అవకాశం ఉంది. అనుకోకుండా ఆశించిన వ్యక్తితో జోడీ కుదురుతుంది. ఈ రాశి యువతీ యువకుల్లో జనాకర్షణ ఎక్కు వగా ఉంటుంది. ప్రయాణాల్లో కానీ, దూర ప్రాంతంలో ఉన్నవారితో కానీ ప్రేమ బంధం ఏర్పడు తుంది. ఇప్పటికే ప్రేమల్లో ఉన్నవారు విహార యాత్రల ద్వారా తమ ప్రేమ భాగస్వామితో సాన్ని హిత్యం పెంచుకోవడం జరుగుతుంది. ‘ప్రేమ’పై ఖర్చు చేయడానికి ఆదాయానికి లోటుండకపోవచ్చు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛలో ఉండడం వల్ల ఈ రాశికి చెందిన యువతి యువ కులు అతి తేలికగా ఇతరులను ఆకట్టుకుంటారు. ఉద్యోగ స్థానంలో సాన్నిహిత్యం వల్ల ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. మనసులోని ప్రేమను ఇంత కాలంగా బయటపెట్టుకోని వ్యక్తులు ఇక బయటపెట్టుకునే అవకాశం ఉంది. వారం రోజుల పాటు వీరి ప్రేమ జీవితం నిత్య కల్యాణం, పచ్చ కల్యాణంలా సాగిపోతుంది. ప్రేమ జీవితాన్ని హ్యాపీగా గడపడానికి అవసరమైన ధనం లభిస్తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): చాలా కాలంగా తాను ప్రేమిస్తున్న వ్యక్తి నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. ఇరుగు పొరు గున ఉన్న వ్యక్తితో ప్రేమ బంధం ఏర్పడుతుంది. ఈ రాశికి ప్రస్తుతం శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోవడంతో పాటు సాన్నిహిత్యం కూడా బాగా పెరుగుతుంది. ప్రేమికులు ఒకరికొకరు కానుకలు బహూకరించుకోవడం ఎక్కువగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో భాగంగా నచ్చి ప్రాంతానికి విహార యాత్రకు వెళ్లడం కూడా జరుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ప్రేమ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. మీ మాటలు, చేతలతో ప్రేమ భాగస్వామి సంతృప్తి చెందుతారు. కొద్ది రోజుల్లోనే పటిష్ఠమైన బంధం ఏర్పడుతుంది. ప్రేమ జీవితం ఈ వారం రోజుల కాలంలో హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. విహార యాత్రకు వెళ్లడం జరుగుతుంది. సాధా రణంగా దూరపు బంధువుతో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. ప్రేమ భాగస్వామి నుంచి అనేక విధాలుగా సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ యాత్రలకు ఆర్థిక వనరుల కొరత ఉండదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ప్రేమ కోసం గట్టి ప్రయత్నమే చేయాల్సి వస్తుంది. మనసులోని ప్రేమను బయటకు చెప్పుకోలేక పోయిన యువతీ యువకులకు ప్రస్తుతం సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రేమల్లో ఆశిం చిన విజయాన్ని సాధించడంతో పాటు, ప్రేమ జీవితాన్ని హ్యాపీగా అనుభవించడానికి అవకాశం కలుగుతుంది. మీ మాట తీరు, మీ వ్యవహారశైలి, మీ హుందాతనం ప్రేమ భాగస్వామికి బాగా నచ్చుతాయి. సహచరులతో మొదటి చూపులోనే ప్రేమ ఏర్పడుతుంది. ఖర్చులకు తగ్గ ధనం లభిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఈ రాశిక అత్యంత శుభుడైన శుక్ర గ్రహం ప్రేమలు, పెళ్లిళ్లకు సంబంధించిన సప్తమ స్థానంలోనే ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారిలో జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అతి తేలికగా ప్రేమ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వీరిని ఇతరులు ప్రేమించే అవకాశం ఎక్కువగా ఉంది. అతి తక్కువ సమయంలోనే సఖ్యత, సాన్నిహిత్యం బాగా పెరుగు తాయి. ప్రేమ ఖర్చులకు కావలసిన ఆదాయం సిద్ధంగా ఉంటుంది. విహార యాత్రలకు అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశివారికి ఆరవ స్థానంలో శుక్ర సంచారం వల్ల ప్రేమ ప్రయత్నాల్లో మొదట్లో అనేక వ్యతిరేక తలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పట్టు వదలకుండా వీరు సాగించిన ప్రయత్నాల వల్ల తప్పకుండా వీరి లక్ష్యం నెరవేరుతుంది. ప్రేమికులు ఒకరి మీద ఒకరు భారీగా ఖర్చు చేసే అవకా శం కూడా ఉంది. కానుకలు, వస్త్రాభరణాలను బహూకరించడంతో పాటు విహార యాత్రలకు కూడా బాగా అవకాశం ఉంది. ఈ రాశివారు సాధారణంగా పరిచయస్థులతో ప్రేమలో పడడం జరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): కొత్తగా ప్రేమలో పడినవారైనా, ఇదివరకే ప్రేమలో పడినవారైనా ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోతారు. ఈ రాశివారిలో చొరవ, పట్టుదల కాస్తంత ఎక్కువడా ఉండే అవకాశం ఉన్నందువల్ల ప్రేమ వ్యవహారాలు త్వరగా విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. ఆదాయానికి లోటు లేనం దువల్ల ప్రేమ భాగస్వామికి భారీగా వస్త్రాభరణాలు బహూకరించే అవకాశం ఉంది. సాధారణంగా మిత్రులతో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. ఈ వారంలో వీరి ప్రేమకు గట్టి పునాదులు పడతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్రుడి ఉచ్ఛ స్థితి కారణంగా ఈ రాశివారిలో ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగలుగుతారు. కొద్ది ప్రయత్నంతో ప్రేమ భాగస్వామి ప్రేమను, అభిమానాన్ని చూరగొంటారు. ఈ రాశివారు బాగా పలుకుబడిన వ్యక్తితో గానీ, సంపన్న కుటుం బానికి చెందిన వ్యక్తితో గానీ ప్రేమలో పడడానికి అవకాశం ఉంది. విహార యాత్రలు, కానుకల మీద భారీగా ఖర్చుపెట్టే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4), శ్రవణం, ధనిష్ట 1,2): సాధారణంగా పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండే ఈ రాశివారు శుక్ర బలం కారణంగా ప్రేమలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తమకు నచ్చిన వ్యక్తిని ఈ రాశివారు గట్టి ప్రయత్నంతో ఆకట్టుకుంటారు. సాధారణంగా తమకు బాగా సన్నిహితమైన వ్యక్తితోనే ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధించిన తర్వాత సాధారణంగా ప్రేమ జీవితానికే అంకితమైపోతారు. ఇష్టమైన ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశివారికి కుటుంబ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల కొద్దిపాటి ప్రేమ ప్రయత్నాలు కూడా గరిష్ఠ స్థాయిలో విజయవంతమవుతాయి. మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. ప్రేమ జీవి తానికి అవసరమైన ఆదాయాన్ని ముందే సిద్ధం చేసుకుంటారు. ప్రేమ భాగస్వామి మీద కానుకల వర్షం కురిపిస్తారు. ఇష్టమైన పర్యాటక ప్రాంతాలను సందర్శించడం ఎక్కువగా ఉంటుంది. వీరి ప్రేమ జీవితం మొదట్లో ఒడిదుడుకులకు లోనయినా ఆ తర్వాత నల్లేరు మీద బండిలా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ రాశిలో ఉచ్ఛ శుక్రుడి సంచారం వల్ల వీరిలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో ప్రేమల్లో విజయాలు సాధిస్తారు. సాధారణంగా ఇతరులు వీరిని ప్రేమించడం జరుగుతుంది. ప్రేమ భాగస్వామికి నచ్చినట్టు వ్యవహరించడంలో వీరు అగ్రగణ్యులు. సాధారణంగా ఇరుగు పొరుగుతో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. ఎక్కువగా పుణ్యక్షేత్రాలకు, ఆలయ ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ప్రేమ భాగస్వామి మీద అనేక విధాలుగా బాగా ఖర్చు చేస్తారు.