
మేషం: ఈ రాశి అధిపతి అయిన కుజుడు ప్రస్తుతం తృతీయ స్థానమైన మిథున రాశిలో సంచారం చేస్తు న్నందువల్ల దాదాపు రెండు నెలల పాటు జీవితం అనేక విధాలుగా పురోగతి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. రెండు మూడుసార్లు ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.

వృషభం: రాశ్యధిపతి శుక్రుడు ప్రస్తుతం దశమ స్థానంలో, 28 నుంచి మీన రాశిలో సంచారం చేయడం జరు గుతుంది. శుక్రుడు మిత్ర, ఉచ్ఛ క్షేత్రాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి అంచనాలకు మించిన ధన లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం ఉంది. నిరు ద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి.

కన్య: రాశ్యధిపతి బుధుడు ప్రస్తుతం పంచమ స్థానంలో, మిత్ర క్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల తప్పకుండా శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. బుధ గ్రహానికి మకర, కుంభ రాశులు మిత్ర క్షేత్రా లైనందువల్ల వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు రెట్టింపు ఫలితాలనిస్తాయి. ప్రతి ప్రయత్నమూ సఫలమవుతుంది.

తుల: రాశ్యధిపతి శుక్రుడు మిత్ర, ఉచ్ఛ క్షేత్రాలలో సంచారం చేస్తున్నందువల్ల మరో రెండు నెలల పాటు ఈ రాశివారి జీవితం విజయాలతో, సాఫల్యాలతో సాగిపోతుంది. ఆర్థికంగా ఊహించని అదృష్టాలు పడతాయి. చిన్న ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత పద వులు చేపట్టడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు, పెళ్లి ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది.

మకరం: రాశ్యధిపతి శని ధన స్థానంలో, అందులోనూ స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల వీరికి ఆదాయం బాగా వృద్ధి చెందడంతో పాటు కుటుంబ జీవితం కూడా నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు కూడా చాలావరకు తగ్గుముఖం పడతాయి. మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది.

కుంభం: రాశినాథుడు శని ఇదే రాశిలో స్వక్షేత్రంలో కొనసాగుతున్నందువల్ల మార్చి 29 వరకు ఈ రాశివారికి శశ మహా పురుష యోగమనే అరుదైన యోగం కలిగింది. ఈ రాశివారికి ఏలిన్నాటి శని ప్రభావం బాగా తక్కువగా ఉంటుంది. సమాజంలో పలుకుబడి, గౌరవ మర్యాదలు వృద్ధి చెందు తాయి. ధన ధాన్య సమృద్ధి యోగం కలుగుతుంది. ఏ ప్రయత్నమైనా నెరవేరుతుంది. ఉద్యోగ పరంగా, ఆర్థికపరంగా స్థిరత్వం లభిస్తుంది. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందడం జరుగుతుంది.