2 / 7
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఉన్న మెహందీపూర్ బాలాజీ ఆలయం ఒక అద్భుతం. ఈ ఆలయంలో హనుమంతుడు చిన్నపిల్ల రూపంలో కూర్చుని భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ఇక్కడ హనుమంతుడు స్వయంగా వెలసినట్లు స్థలపురాణం. ఈ ఆలయానికి రాజస్థాన్‌లోనే కాదు దేశం మొత్తం గుర్తింపు ఉంది. దెయ్యం, పిశాచాలు వంటి వాటితో బాధపడే భక్తులు కేవలం ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడం ద్వారానే కోలుకుంటారు. భారీ సంఖ్యలో హనుమంతుడి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. ఈ ఆలయంలో వీర హనుమంతునితో పాటు భైరవుడు, శివుడు కూడా పూజలను అందుకుంటున్నారు. ఇక్కడ ఇచ్చే ప్రసాదాన్ని తినకూడదని అంటారు. అదేవిధంగా పూజ చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదని చెబుతారు. పూజానంతరం ఇక్కడ భక్తులు తమ బాధలను తెలియజేస్తూ.. భగవంతుని పాదాల వద్ద మోకరిల్లుతారు.