
సెప్టెంబర్ 26వ తేదీ సోమవారం.. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గ అమ్మవారు స్వర్ణ కవచాలంకృత కనక దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించడం వలన సకల దారిద్య్రం నశించి, బక్తులకు రక్షణ లభిస్తుంది. శుభదాయకం, ఆనందదాయకం, ఐశ్వర్యప్రదాయకం.

సెప్టెంబర్ 27వ తేదీ మంగళవారం శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు. దసరా ఉత్సవాల్లో భక్తులకు పూర్ణ ఫలం ఇచ్చే అలంకారం శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి.

సెప్టెంబర్ 28వ తేదీ బుధవారం శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా దర్శమిస్తారు. అమ్మవారిని గాయత్రీ అలంకారంలో దర్శించుకోవడం వలన ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగా కొలుస్తూ.. తల్లిని దర్శించడం వలన సకల మంత్రం సిద్ధి తేజస్సు, జ్ఞానం పొందుతారు.

సెప్టెంబర్ 29వ తేదీ గురువారం శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో ఉన్న దుర్గాదేవిని దర్శించి తరించడం వలన అన్నాదులకు లోపం లేకుండా ఇతరులకు అన్నదానం చేసే భాగ్యాన్ని పొందుతారు.

సెప్టెంబర్ 30వ తేదీ శుక్రవారం శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరీ దేవిగా దర్శనమిస్తారు. వాత్సల్య రూపిణిని దర్శనం ఉపాసకులకు అనుగ్రహాన్ని ఇస్తుంది.

అక్టోబర్ 1వ తేదీ శనివారం శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ గా దర్శనమిస్తారు. మంగళప్రదమైన అమ్మవారిని ఈ రూపంలో దర్శించుకోవడం ధన, ధాన్య, సౌభాగ్య, సంతాన వరాలను అందిస్తుందని నమ్మకం. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడం వలన భక్తులకు ఐశ్వర్య ప్రాప్తి, విజయం లభిస్తుంది.

అక్టోబర్ 2వ తేదీ ఆదివారం శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శమిస్తారు. ఈ అలంకారంలో అమ్మ వారిని కొలవడం వలన విద్యార్థినీ విద్యార్థులకు విజయం సిద్ధిస్తుంది.

అక్టోబర్ 3వ తేదీ సోమవారం శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ అలంకారంలో అమ్మవారి దర్శనం భక్తులకు సకల శుభాలను కలుగజేస్తుంది.

అక్టోబర్ 4వ తేదీ మంగళవారం శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ మహిషాసుర మర్ధనీ దేవిగా దర్శనమిస్తుంది. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించడం వలన సర్వదోషాలు తొలగి దైర్యం విజయాలు చేకూరతాయి.

అక్టోబర్ 5వ తేదీ బుధవారం శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తారు. ఈ అలంకారంలో అమ్మవారి దర్శనం సకల శుభాలు, విజయాలు చేకూరతాయి.

అక్టోబర్ 5వ తేదీ బుధవారం శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సాయంత్రం 5 గంటలకు కృష్ణ నదిలో తెప్పోత్సవం..