నియమ నిబంధనల ప్రకారం కార్తీక మాసంలో శివుడిని, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో ఎప్పటికీ సంతోషం, విజయం లభిస్తుంది. ఈ మాసంలో చేసే పూజ, దానాల గురించి మాత్రమే కాదు తినే ఆహారం విషయంలో కూడా కొన్ని నియమాలున్నాయి. ఈ మాసంలో చేసే జపం, తపస్సు, ఉపవాసం, ధ్యానం మొదలైన వాటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ జన్మలో భక్తులు నేలపై శయనించి, బ్రహ్మచర్యాన్ని ఆచరించి, దీపదానం చేయడం, తులసి చెట్టును పూజించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని పురాణాల పేర్కొన్నాయి.