Lord Shani: హమ్మయ్య.. శని దోషానికి విరామం..! ఆ రాశులకు కష్టనష్టాల నుంచి ఊరట..!
Shani Dosha Relief: ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు కొన్ని రాశులను వేధించే, బాధించే పనిలో నిమగ్నమై ఉన్నాడు. మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశులకు తొమ్మిది నెలలుగా తన తడాఖా చూపిస్తున్నాడు. అయితే, ఈ నెల(అక్టోబర్) 19 నుంచి డిసెంబర్ 5 వరకు, అంటే 46 రోజుల పాటు ఈ రాశుల కష్టనష్టాలకు శనీశ్వరుడు సెలవు లేదా విరామం ప్రకటించడం జరుగుతోంది. గురువు తనకు ఉచ్ఛ రాశి అయిన కర్కాటక రాశిలో ప్రవేశించి, శనిని వీక్షించడం వల్ల శని ప్రభావం పూర్తిగా మటుమాయం అవుతుంది. దీనివల్ల ఈ రాశులకు ఎంతో ఊరట కలుగుతుంది. శనిని గురువు కలిసినా, చూసినా శని దోషం తగ్గిపోతుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6