Akshardham: అక్షరధామ్ ఆలయంలో ఘనంగా జల్ఝుల్ని ఏకాదశి, గణేష్ నిమజ్జనోత్సవం..

|

Sep 14, 2024 | 4:49 PM

ఢిల్లీలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అక్షరధామ్ ఆలయంలో శనివారం జల్ఝుల్ని ఏకాదశి (పరివర్తిని ఏకాదశి) పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. దీనితో పాటు గణేష్ చతుర్థి రోజున ప్రతిష్టించిన గణేశుడి విగ్రహ నిమజ్జనం కూడా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

1 / 5
దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకల సందడి నెలకొంది. వాడవాడలా అన్ని ప్రాంతాల్లో గణేష్ ప్రతిమలను ప్రతిష్టించి నవరాత్రి ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ప్రతిష్ట నుంచి నిమజ్జనం వరకు ఈ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో జలఝులని ఏకాదశి, గణపతి నిమజ్జనోత్సవాన్ని శనివారం అట్టహాసంగా నిర్వహించారు. గణపతి బప్పా మోరియా.. జై జై గణేష అంటూ నినాదాలు మార్మోగాయి.

2 / 5
ఢిల్లీలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అక్షరధామ్ ఆలయంలో శనివారం జల్ఝుల్ని ఏకాదశి (పరివర్తిని ఏకాదశి) పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. దీనితో పాటు గణేష్ చతుర్థి రోజున ప్రతిష్టించిన గణేశుడి విగ్రహ నిమజ్జనం కూడా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

ఢిల్లీలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అక్షరధామ్ ఆలయంలో శనివారం జల్ఝుల్ని ఏకాదశి (పరివర్తిని ఏకాదశి) పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. దీనితో పాటు గణేష్ చతుర్థి రోజున ప్రతిష్టించిన గణేశుడి విగ్రహ నిమజ్జనం కూడా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

3 / 5
జల్ఝుల్ని ఏకాదశి, గణేష్ నిమజ్జనం సందర్భంగా అక్షరధామ్ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి భక్తి పారవశ్యంలో మునిగితేలారు. పలువురు సాధువులు, మహనీయులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజల్లో భాగమయ్యారు. జల్ఝుల్ని ఉత్సవ్ అనేది ఉత్తర భారతదేశంలో జరుపుకునే పండుగ, దీనిని జల్ఝుల్ని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పండుగ సాంప్రదాయకంగా అక్షరధామ్ ఆలయంలో ప్రతి సంవత్సరం వేడుకగా నిర్వహిస్తారు.

4 / 5
నిమజ్జనం కోసం భారీ సరస్సును నిర్మాణం:  అక్షరధామ్ ఆలయంలో జల్ఝుల్ని, గణపతి నిమజ్జనం వేడుకలకు సద్గురు వివేక్‌సాగర్ స్వామి కూడా హాజరయ్యారు. ఆయన హాజరవ్వడం ఈ వేడుకను మరింత ప్రత్యేకం చేసింది. గణపతి నిమజ్జనం కోసం అక్షరధామ్ ఆడిటోరియంలో భారీ సరస్సును తయారు చేశారు. అందులో గణపతి బప్పా విగ్రహాలను నిమజ్జనం చేశారు. బప్పా పిల్లలకు బెస్ట్ ఫ్రెండ్.. అందుకే చాలా మంది పిల్లలు కూడా తమ బుజ్జి బుజ్జి వినాయక విగ్రహాలతో అక్షర్‌ధామ్ కు వచ్చి నిమజ్జనం చేశారు.

5 / 5
ఈ సందర్భంగా స్వామివారికి ఐదు హారతులు, వివిధ నైవేద్యాలు సమర్పించారు. అక్షరధామ్ ఆలయంలో ఉదయం 8 గంటలకు గణపతి నిమజ్జనం, జల్ఝుల్ని ఏకాదశి పండుగ ప్రారంభమైంది. స్వామిని పల్లకీలో కూర్చోబెట్టి ఆలయంలోనే ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేశారు. భగవంతుని లీలలను వివరించేందుకు స్వామి వివేక్ సాగర్ ఉపన్యాసం చేసి పండుగ సారాంశాన్ని వివరించారు. ప్రత్యేక పూజలతో పాటు కీర్తన, భజన కూడా నిర్వహించారు.