Ratha Yatra 2024: రథ యాత్ర కోసం ఎంత కలప సేకరిస్తారు..? యాత్ర ముగిసిన అనంతరం ఆ కలపను ఏమి చేస్తారో తెలుసా..

|

Jul 04, 2024 | 12:13 PM

ఏటా జరిగే జగన్నాథుని రధయాత్ర కోసం ఎంతో భక్తీ శ్రద్దలతో భక్తులు ఎదురుచుస్తారు. రెండు నెలల ముందు నుంచే రథాల తయారీ మొదలవుతుంది. రథయాత్ర సందర్భంగా జగన్నాథుడు అతని సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రుడు మూడు రథాల్లో తమ అత్త ఇంటికి వెళ్తారు. ఈ రథయాత్ర ముగిసిన అనంతరం ఆ రథం పరిస్థితి ఏమిటి? అనేది కొంతమంది మాత్రమే తెలుసు. సంప్రదాయం ప్రకారం జగన్నాథుని రథానికి 16 చక్రాలు, బలభద్రుడి రథానికి 1 చక్రం , సుభద్ర రథానికి 12 చక్రాలతో రథాలను ప్రతి ఏడాది తయారుచేస్తారు. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో రథాన్ని తయారు చేసే ప్రక్రియ అక్షయ తృతీయ నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి రథం ఫ్రేమ్‌వర్క్ వేప చెక్కతో తయారు చేయబడింది.

1 / 8
జగన్నాథ రథయాత్రకు సన్నాహాలు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. పూరీ ఆలయ ప్రాంగణంలో రథాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం పూరీ క్షేత్రం ఎక్కడ చూసినా భక్త గణంతో నిండిపోయింది. జగన్నాథుని రథయాత్రలో పాల్గొనేందుకు, రథయాత్రను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు.

2 / 8
రథయాత్ర మహోత్సవంలో పాల్గొనడం ద్వారా వంద యాగాలకు సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం. భక్తుల హారతులకు జగన్నాథుడే స్పందిస్తాడు. కష్టాలు తీరుస్తాడు. అంతేకాకుండా, రథాన్ని తాకినా.. తాడును లాగడం ద్వారా లేదా తాడును తాకడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం.

3 / 8
జగన్నాథుడు రథయాత్రతో అత్త గుండిచా గుడికి చేరుకుంటారు. ఇక్కడ వారం రోజుల పాటూ గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించి సుభద్ర, బలభద్రులతో కలిసి జగన్నాథుడు దశమినాడు తిరుగు ప్రయాణం చేస్తారు. దీనిని బహుదాయాత్ర అంటారు. జగన్నాథుడు తన అత్త ఇంటి గుండిచా గుడి నుంచి పూరీలోని ప్రధాన ఆలయానికి తిరిగి వస్తాడు. ఇద్దరు తోబుట్టువులతో నివసిస్తాడు. అయితే రథయాత్ర ఉత్సవం తర్వాత భారీ రథాలు ఏమవుతాయి? రథాలకు ఉపయోగించే చెక్కల సంగతేంటి?

4 / 8

హిందూ పంచాంగం ప్రకారం ఈ రథ యాత్ర ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో శుక్లపక్షం రెండవ రోజున ప్రారంభమవుతుంది. ఈ పండుగ సందర్భంగా జగన్నాథుడు,  సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రుడుకలిసి మూడు రథాలలో అత్త ఇంటికి వెళ్తారు.

5 / 8
జగన్నాథ ఆలయ నియమాల ప్రకారం రథం నిర్మాణానికి ఉపయోగించే కలప పూరీ, దస్పల్లా , రాణాపూర్ సమీపంలోని రెండు రక్షిత అడవుల నుంచి సేకరిస్తారు. ప్రతి సంవత్సరం రథాల నిర్మాణం కోసం చెక్కను సేకరించే చెట్లను నరికి వేయాల్సి వస్తుంది. అయితే రథం కోసం ఎన్ని చెట్లు నరికి వేస్తారో.. అందుకు రెండింతలు చెట్లను నాటుతారు.

6 / 8
రథయాత్రకు ముందు రథాల నిర్మాణం కోసం వైశాఖ బహుళ విదియ రోజున పనులు మొదలు పెడతారు. పూరీ మహారాజు పూజారుల్ని పిలిపించి కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడు. అప్పటికే రథాల తయారీకి కావాల్సిన అవసరమైన వృక్షాల్ని ఎంపిక చేస్తారు. ఆ మొక్కలకు వేదపండితులు శాంతి నిర్వహించిన అనంతరం వాటిని జాగ్రత్తగా నరికి 1,072 కాండాలను పూరీకి తీసుకుని వస్తారు.

7 / 8
ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయనాడు రథాల తయారీకి శ్రీకారం చుడతారు. రథాల నిర్మాణానికి 13 వేల ఘనపుటడుగుల కలప సేకరించి ముందు చెట్ల కలపను 2,188 ముక్కలుగా విడదీస్తారు. ఆ ముక్కల్లో 832 ముక్కల్ని జగన్నాథుడి రథానికి.. బలభద్రుడి రథం కోసం 763 ముక్కల్ని , 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం ఉపయోగిస్తారు.

8 / 8

సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం రథయాత్ర ముగింపులో జగన్నాథ ఆలయ వంటశాలలో మహాప్రసాదాన్ని సిద్ధం చేయడానికి రథం తయారీకి ఉపయోగించిన చెక్కను ఉపయోగిస్తారు. అదే సమయంలో భక్తులకు ప్రసాదానికి బదులుగా మూడు రథచక్రాలను పంపిణీ చేస్తారు.