శ్రావణ మాసంలో ఇంటి ముందు ఇలాంటి ముగ్గులు వేస్తే లక్ష్మీ కటాక్షం..

Updated on: Jul 30, 2025 | 3:24 PM

ఇంటి ముందు ముగ్గువేయడం భారతీయ సంప్రదాయాల్లో ఒకటి.. దీనివల్ల కుటుంబానికి శుభం కలుగుతుందని నమ్మకం. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఇంటి ముందు ముగ్గు వేయడం అనేది సంపద, శ్రేయస్సును ఇచ్చే దేవత లక్ష్మీ దేవి ఇంట్లోకి వస్తుందని నమ్మకం. మరి ఈ మాసంలో ఇంటి ముందు ముగ్గు ఎలా వెయ్యాలి అనే విషయంపై చాలామందికి సందేహం కలుగుతుంది. దాని గురించి ఇక్కడ తెలుసుకోండి. 

1 / 5
శ్రావణ మాసంలో చేసే పూజలు, నోములు, వ్రతాలు అనంత పుణ్యాన్ని ప్రసాదిస్తాయని శాస్త్రవచనం. శ్రీమహావిష్ణువుకు, శ్రీమహాలక్ష్మికి, పరమ శివునికి అత్యంత ప్రీతికరమైన ఈ శ్రావణమాసంలో వ్రతాలు, నోములు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను కలుగుతాయని విశ్వాసం. అందుకనే ఈ శ్రావణ మాసాన్ని ఆధ్యాత్మిక మాసం అని కూడా అంటారు.

2 / 5
శ్రావణ మాసం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో వివిధ ఆచారాలు, పండుగలు లక్ష్మీ దేవికి అంకితం చేయబడతాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో తామర పువ్వులు, స్వస్తికలు, రేఖాగణిత నమూనాలు వంటి శుభ చిహ్నాలను కలిగి ఉన్న రంగోలి డిజైన్లుతో ఇంట్లోకి లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుంది. 

3 / 5
శ్రావణ మాసంలోని రెండవ శుక్రవారం లేదా పూర్ణిమ (పౌర్ణమి) ముందు శుక్రవారం జరిగే ఈ పండుగ ప్రత్యేకంగా లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది. ఈ రోజున వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే సంపద శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. ఈరోజు ఇంటిముందు ముగ్గులు వేయడం శ్రేయస్సు, శుభం, ఇంటికి సానుకూల శక్తిని స్వాగతించడాన్ని సూచిస్తాయి. 

4 / 5
సహజ రంగులు, పువ్వుల రేకులు, కొవ్వొత్తులు, దీపాలు వంటి ఇతర అలంకార అంశాలను ఉపయోగించి ముగ్గులు వేయవచ్చని పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసంలో ఇలా ముగ్గులు ముగ్గులు వేస్తే ఆర్థికంగా బలపడతారని హిందువులు నమ్ముతారు. 

5 / 5
రంగోలితో పాటు, శ్రావణ మాసంలో లక్ష్మి పాదముద్రలుతో ఇంటి ప్రవేశ ద్వారన్ని అలంకరించడం, పూజ చేయడం వంటి ఇతర పద్ధతులతో కూడా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ మాసంలో ఇంటి ముందు స్థలాన్ని శుభ్రపరచి, శుద్ధి చేసి లక్ష్మీ దేవిని స్వాగతించేలా ముగ్గులు వెయ్యడం ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. 