
వాస్తు శాస్త్రం ప్రకారం బాత్‌రూమ్‌లో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులు ఉంచకూడదని చెబుతున్నారు నిపుణులు. దాని వలన మీరు పేదరికంలో కూరుకపోవడం, ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. కాగా, అసలు బాత్‌రూమ్‌లో ఎలాంటి వస్తువులు ఉండకూడదో ఇప్పుడు చూద్దాం.

బాత్ రూమ్‌లో ఎప్పుడూ కూడా ఖాళీ బకెట్స్ ఉండనివ్వకూడదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఎందుకంటే? ఇది అనేక సమస్యలకు కారణం అవుతుందంట. ఎవరి ఇంట్లోనైతే బాత్ రూమ్‌లో ఖాళీ, విరిగిన బకెట్ ఉంటుందో, వారు వాస్తు దోషాలు, వాస్తు సమస్యలు ఎదుర్కోక తప్పదు.

వాస్తు శాస్త్రం ప్రకారం, ఎప్పుడూ కూడా బాత్‌రూమ్‌లో పగిలిన గాజు ఉండటం శ్రేయస్కరం కాదు. ఇది మీకు చాలా కష్టాలను తీసుకొస్తుంది. అందువలన మీరు మీ బాత్ రూమ్‌లో పగిలిన గాజు వంటిది ఉంటే వెంటనే తీసివెయ్యడం చాలా వరకు శ్రేయస్కరం.

కొందరు స్నానం చేసే క్రమంలో తడి బట్టలను బాత్‌రూమ్‌లోనే ఉంచేస్తుంటారు. కానీ అలా చేయడం కూడా చాలా ప్రమాదకరం అంట. ఎవరైతే ఎక్కువ సేపు బాత్‌రూమ్‌లో తడి బట్టలను ఉండనిస్తారో, వారు వాస్తు సమస్యలు ఎదర్కోక తప్పదని చెబుతున్నారు నిపుణులు.

వాస్తు శాస్త్రంలో చెప్పుల గురించి అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. ఎప్పుడూ కూడా, గుమ్మానికి ఎదురుగా, చెప్పులు విప్ప కూడదు అంటారు. అదే విధంగా, బాత్ రూమ్‌లో కూడా విరిగిన చెప్పులు ఉండటం శ్రేయస్కరం కాదంట. ఇది పేదరికానికి, అప్పుల సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.